ఉక్రెయిన్‌కు మరో ఎదురుదెబ్బ

రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు దొనెట్స్క్‌ ప్రాంతంలో వ్యూహాత్మకంగా చాలా కీలకమైన చాసివ్‌ యార్‌ పట్టణ శివార్ల నుంచి ఆ దేశ బలగాలు వెనక్కి మళ్లాయి.

Published : 05 Jul 2024 04:48 IST

కీలక పట్టణం నుంచి వెనక్కి మళ్లిన ఆ దేశ బలగాలు

కీవ్‌: రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు దొనెట్స్క్‌ ప్రాంతంలో వ్యూహాత్మకంగా చాలా కీలకమైన చాసివ్‌ యార్‌ పట్టణ శివార్ల నుంచి ఆ దేశ బలగాలు వెనక్కి మళ్లాయి. దీంతో చాసివ్‌ యార్‌ను మాస్కో సేనలు ఆక్రమించడం ఇక లాంఛనప్రాయమే అనిపిస్తోంది. రష్యా నిరుడు ఆక్రమించిన బఖ్ముత్‌ నగరానికి పశ్చిమాన ఈ పట్టణం ఉంది. దాన్ని పుతిన్‌ సేనలు ఆక్రమిస్తే.. చుట్టుపక్కల నగరాల భద్రత ప్రమాదంలో పడినట్లే. దొనెట్స్క్‌ ప్రాంతమంతటినీ తన వశం చేసుకోవాలన్న లక్ష్యానికి రష్యా చేరువయ్యేందుకు మార్గం సుగమమవుతుంది కూడా. చాసివ్‌ యార్‌ శివార్లలోని నజార్‌ వొలొశిన్‌ పట్టణం నుంచి తాజాగా తమ బలగాలు వెనక్కి మళ్లిన సంగతిని ఉక్రెయిన్‌ సైన్యం స్వయంగా వెల్లడించింది. నెల రోజులుగా అక్కడ రష్యా బలగాలు భీకర దాడులు చేస్తున్నాయని, తమ రక్షణ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాయని తెలిపింది. యుద్ధం ప్రారంభానికి ముందు చాసివ్‌ యార్‌లో 12 వేల వరకు జనాభా ఉండేదని, ప్రస్తుతం అది ఎడారిని తలపిస్తోందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని