ఇజ్రాయెల్‌పైకి 200 రాకెట్లు.. హెజ్‌బొల్లా ప్రతీకార దాడి

ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తమ కమాండర్‌ మృతికి ప్రతీకారంగా గురువారం హెజ్‌బొల్లా.. ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలపైకి ఏకంగా 200కుపైగా రాకెట్లను, డ్రోన్లను ప్రయోగించింది.

Published : 05 Jul 2024 04:47 IST

బీరుట్‌: ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తమ కమాండర్‌ మృతికి ప్రతీకారంగా గురువారం హెజ్‌బొల్లా.. ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలపైకి ఏకంగా 200కుపైగా రాకెట్లను, డ్రోన్లను ప్రయోగించింది. బుధవారం హెజ్‌బొల్లా సీనియర్‌ కమాండర్‌ మహమ్మద్‌ నామెహ్‌ నాసిర్‌ ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. భారీస్థాయిలో రాకెట్లు ప్రయోగించినా, తమకు ఎలాంటి తీవ్రనష్టం జరగలేదని టెల్‌ అవీవ్‌ పేర్కొంది. చాలా రాకెట్లను మధ్యలోనే అడ్డుకున్నామని తెలిపింది. 

హమాస్‌ కొత్త ప్రతిపాదన

కాల్పుల విరమణకు సంబంధించి గతంలో ఇజ్రాయెల్‌ చేసిన ప్రతిపాదనకు హమాస్‌ కొన్ని సవరణలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ మిలిటెంట్‌ సంస్థ.. మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఈజిప్టు, ఖతార్‌లకు పంపింది. ఇజ్రాయెల్‌ కూడా వీటిని పరిశీలిస్తోంది. ఈ కొత్త సవరణలపై అంగీకారం కుదిరే అవకాశాలు ఉన్నాయని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు గాజాలో మృతుల సంఖ్య 38 వేలు దాటింది. ఇజ్రాయెల్‌ భూతల, వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం ఖాన్‌ యూనిస్‌లోని ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్‌ జరిపిన క్షిపణి దాడిలో ఏడుగురు పాలస్తీనియన్లకు గాయాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని