యుద్ధభూమిలో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా పంపండి

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో చిక్కుకుపోయిన భారత జాతీయులను క్షేమంగా స్వదేశానికి తిప్పిపంపాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్‌ లావ్రోవ్‌ను బుధవారం భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ గట్టిగా కోరారు.

Updated : 04 Jul 2024 06:41 IST

రష్యా విదేశాంగ మంత్రిని కోరిన జైశంకర్‌

అస్తానా: (కజఖ్‌స్థాన్‌) రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో చిక్కుకుపోయిన భారత జాతీయులను క్షేమంగా స్వదేశానికి తిప్పిపంపాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్‌ లావ్రోవ్‌ను బుధవారం భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ గట్టిగా కోరారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌.సి.ఓ) వార్షిక సమావేశంలో పాల్గొనడానికి ఆయన మంగళవారం కజఖ్‌స్థాన్‌లోని అస్తానాకు వచ్చారు. ప్రధాని మోదీ వచ్చేవారం రష్యా సందర్శనకు వెళ్లనున్నారనే వార్తల నేపథ్యంలో లావ్రోవ్‌-జైశంకర్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్ధభూమిలో భారతీయులు చిక్కుకుపోయారన్న వార్తలపై రష్యా విదేశాంగ మంత్రికి తమ ఆందోళన తెలిపినట్లు జైశంకర్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. దాదాపు 200 మంది భారతీయులను ఉద్యోగాల పేరిట మోసగించి అక్కడకు తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని