రష్యా క్షిపణుల దాడిలో ఐదుగురి మృతి

తూర్పు ఉక్రెయిన్‌లోని నిప్రొ నగరంపై బుధవారం రష్యా చేసిన క్షిపణి దాడుల్లో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Published : 04 Jul 2024 04:05 IST

కీవ్‌: తూర్పు ఉక్రెయిన్‌లోని నిప్రొ నగరంపై బుధవారం రష్యా చేసిన క్షిపణి దాడుల్లో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 47 మందికి గాయాలయ్యాయి. పట్టపగలు జరిగిన ఈ దాడిలో ఓ షాపింగ్‌ మాల్, రెండు పాఠశాలల్లోని అద్దాలు పగిలాయి. ఓ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. దాడికి సంబంధించిన దృశ్యాలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ బుధవారం ఉక్రెయిన్‌కు 2.2 బిలియన్‌ డాలర్ల రుణం మంజూరు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని