17.42 గంటల్లో ఇంగ్లిష్‌ ఛానల్‌ ఈదిన భారత మాతృమూర్తి

ఇంగ్లిష్‌ ఛానల్‌ను ఈదిన మొదటి భారతీయ మాతృమూర్తిగా మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన తన్వీ చవాన్‌ దేవరె (33) రికార్డు సృష్టించారు.

Published : 03 Jul 2024 05:27 IST

ఇంగ్లిష్‌ ఛానల్‌ను ఈదిన మొదటి భారతీయ మాతృమూర్తిగా మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన తన్వీ చవాన్‌ దేవరె (33) రికార్డు సృష్టించారు. బ్రిటన్‌లోని డోవర్‌ నుంచి ఫ్రెంచ్‌ తీరం వరకు 42 కి.మీ.ల దూరాన్ని ఇద్దరు పిల్లల తల్లి అయిన తన్వీ 17.42 గంటల్లో చేరుకున్నారు. జూన్‌ 29 ఉదయం 8.00 గంటలకు ప్రారంభించి, మధ్యలో ఎలాంటి విశ్రాంతి లేకుండా లక్ష్యం పూర్తి చేశారు. ఇంగ్లాండ్,  ఫ్రాన్స్‌లను వేరుచేసే ఇంగ్లిష్‌ ఛానల్‌ను ఈదడం చాలా కష్టమైన ప్రక్రియ. ఇందుకోసం ప్రతిరోజూ 8 - 10 గంటలు అభ్యాసం చేసినట్లు తన్వీ తెలిపారు. 16 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్న చల్లటినీటిలో ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, మధ్యలో జెల్లీ చేపలు కుట్టినట్లు ఆమె వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని