తీరం దాటిన ‘బెరిల్‌’ హరికేన్‌

కరీబియన్‌ దీవులను ‘బెరిల్‌’ హరికేన్‌ గజగజలాడిస్తోంది. సోమవారం అది మరింత తీవ్ర రూపం దాల్చి.. కరియాకౌ ఐలాండ్‌లో తీరం దాటింది.

Published : 02 Jul 2024 05:35 IST

బార్బడోస్‌లో ఎగసిపడుతున్న అలలు

ప్యూర్టోరికో: కరీబియన్‌ దీవులను ‘బెరిల్‌’ హరికేన్‌ గజగజలాడిస్తోంది. సోమవారం అది మరింత తీవ్ర రూపం దాల్చి.. కరియాకౌ ఐలాండ్‌లో తీరం దాటింది. దాదాపు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ధాటికి బార్బడోస్, గ్రెనెడా, టొబాగో, సెయింట్‌ విన్సెంట్, గ్రెనెడీస్‌ తదితర ప్రాంతాల్లోని చాలా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలూ వేళ్లతోసహా నేలకూలాయి. ఈ బెరిల్‌ చాలా ప్రమాదకరమైంది కావడంతోపాటు జీవన్మరణ సమస్యనూ మోసుకొచ్చినట్లు నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌ హెచ్చరించింది. 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఐవాన్‌’ తర్వాత.. అంతటి భారీ హరికేన్‌ ఇదేనని పేర్కొంది. బెరిల్‌ ప్రభావం అనంతరం డ్రోన్ల సాయంతో నష్టం తీవ్రతను అంచనా వేయనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతోపాటు ఇళ్లనూ నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని