మనవళ్ల సంరక్షణ చూసే అవ్వాతాతలకు సెలవులు!

పిల్లల పెంపకం దిశగా స్వీడన్‌ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. మనవళ్ల సంరక్షణ కోసం అవ్వాతాతలకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనే చట్టం తెచ్చింది.

Published : 02 Jul 2024 05:29 IST

పితృత్వ సెలవుల్లో స్వీడన్‌ కొత్త ఒరవడి 

కోపెన్‌హేగన్‌(డెన్మార్క్‌): పిల్లల పెంపకం దిశగా స్వీడన్‌ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. మనవళ్ల సంరక్షణ కోసం అవ్వాతాతలకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలనే చట్టం తెచ్చింది. మనవడు/మనవరాలికి ఏడాది వచ్చేవరకూ వారు గరిష్ఠంగా మూడు నెలలపాటు ఈ సెలవులు తీసుకోవచ్చు. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులు తమ వేతనంతో కూడిన సెలవుల్ని బిడ్డ అవ్వాతాతలకు బదిలీ చేయొచ్చు. తల్లి/తండ్రి గరిష్ఠంగా 45 రోజుల చొప్పున బిడ్డ అవ్వాతాతలకు సెలవుల్ని బదిలీ చేయొచ్చు. సింగిల్‌ పేరెంట్‌ ఉంటే 90 రోజుల సెలవుల్ని ఇలా మార్పిడి చేసుకోవచ్చు. దాదాపు కోటి జనాభా ఉన్న స్వీడన్‌.. పుట్టుక నుంచి చావు వరకూ తమ పౌరుల సంక్షేమాన్ని ప్రభుత్వమే చూసుకునేలా అనేక పథకాల్ని అమలుచేస్తోంది. ప్రపంచంలోనే మొదటిసారిగా, సరిగ్గా 50 ఏళ్ల కిందట పితృత్వ సెలవుల్ని తెచ్చిందీ స్వీడనే! అక్కడ ప్రస్తుతం బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులు 480 రోజులపాటు వేతనంతో కూడిన సెలవు తీసుకోవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని