ఇజ్రాయెల్‌ నుంచి 55 మంది పాలస్తీనా బందీల విడుదల

పాలస్తీనాకు చెందిన 55 మంది బందీలను ఇజ్రాయెల్‌ సోమవారం విడుదల చేసింది. వారిలో గాజాలోని షిఫా ఆసుపత్రి డైరెక్టర్‌ మహ్మద్‌ అబు సల్మియా కూడా ఉన్నారు.

Published : 02 Jul 2024 04:50 IST

ఖాన్‌ యూనిస్‌: పాలస్తీనాకు చెందిన 55 మంది బందీలను ఇజ్రాయెల్‌ సోమవారం విడుదల చేసింది. వారిలో గాజాలోని షిఫా ఆసుపత్రి డైరెక్టర్‌ మహ్మద్‌ అబు సల్మియా కూడా ఉన్నారు. ఏడు నెలల క్రితం ఆయన్ను ఇజ్రాయెల్‌ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆసుపత్రిని హమాస్‌ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మార్చారని ఆరోపిస్తూ సల్మియాను ఇజ్రాయెల్‌ బంధించింది. అప్పటినుంచి ఆయనపై విచారణ జరపకుండానే నిర్బంధ కేంద్రంలో ఉంచడం గమనార్హం. పెద్ద సంఖ్యలో ఉన్న బందీల కారణంగా నిర్బంధ కేంద్రాలు సరిపోక వీరిని విడుదల చేసినట్లు తెలుస్తోంది. మహ్మద్‌ అబు సల్మియాను విడుదల చేయడంపై ఇజ్రాయెల్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిర్బంధ కేంద్రాల్లో బందీలపై గార్డులు నిత్యం పాశవిక దాడులకు పాల్పడుతున్నారని సల్మియా వెల్లడించారు. తన వేలు విరిచేశారని, కర్రలతో బాదడం వల్ల తన తల పగిలి రక్తం కారినట్లు చెప్పారు. తమపై కుక్కలను కూడా ఉసిగొల్పారన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని