ఆస్టియోపొరోసిస్‌ ముప్పుపై హెచ్చరికలు చేసే ఏఐ

ఎముకలను గుల్లబార్చే ఆస్టియోపొరోసిస్‌ రుగ్మత ముప్పును ముందుగానే పసిగట్టేందుకు ఒక కృత్రిమ మేధ (ఏఐ) నమూనా సిద్ధమైంది.

Published : 02 Jul 2024 05:34 IST

దిల్లీ: ఎముకలను గుల్లబార్చే ఆస్టియోపొరోసిస్‌ రుగ్మత ముప్పును ముందుగానే పసిగట్టేందుకు ఒక కృత్రిమ మేధ (ఏఐ) నమూనా సిద్ధమైంది. అమెరికాలోని టులేన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.

ఆస్టియోపొరోసిస్‌కు కారణమయ్యే 10 ముఖ్యమైన అంశాలను పరిశోధకులు గుర్తించారు. వయసు, బరువు, పిడికిలి పట్టు, అధిక రక్తపోటుతోపాటు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఇందులో ఉన్నాయి. అనంతరం.. 40 ఏళ్లు పైబడ్డ 8వేల మంది డేటాను ఉపయోగించి ఒక డీప్‌ లెర్నింగ్‌ అల్గోరిథమ్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది ఒకరకమైన ఏఐ. మానవ మెదడును అనుకరించడం దీని ప్రత్యేకత. భారీ డేటాసెట్లను పరిశీలించి, వాటిలో విభిన్న పోకడలను ఇది గుర్తించగలదు. తాజా ఏఐ నమూనా సాయంతో ఆస్టియోపొరోసిస్‌ ముప్పును ముందుగానే పసిగట్టవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రుగ్మతకు సకాలంలో నివారణ చర్యలు చేపట్టడానికి ఇది వీలు కల్పిస్తుందని వివరించారు. ఈ సాధనంపై మరిన్ని పరిశోధనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని