ఫ్రాన్స్‌లో పార్లమెంటరీ ఎన్నికల తొలి విడత పూర్తి

ఫ్రాన్స్‌లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న పార్లమెంటరీ ఎన్నికల పర్వం ప్రారంభమైంది. మొత్తం రెండు విడతల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. ఆదివారం తొలి రౌండ్‌ పోలింగ్‌ పూర్తయింది.

Published : 01 Jul 2024 05:21 IST

పారిస్‌: ఫ్రాన్స్‌లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న పార్లమెంటరీ ఎన్నికల పర్వం ప్రారంభమైంది. మొత్తం రెండు విడతల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. ఆదివారం తొలి రౌండ్‌ పోలింగ్‌ పూర్తయింది. ఈ నెల ఏడున మలి విడత పోలింగ్‌ జరగనుంది. దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ నేతృత్వంలోని సెంట్రిస్ట్‌ కూటమి, అతి మితవాద నేషనల్‌ ర్యాలీ, న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ల మధ్య త్రిముఖ పోరు హోరాహోరీగా కనిపిస్తోంది. 2022 నాటి ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా ఓటింగ్‌ శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.95 కోట్లు. వారు పార్లమెంటుకు 577 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో అతి మితవాదులు ఘన విజయం సాధించడంతో మెక్రాన్‌ పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు