భీకర హరికేన్‌ ముప్పు అంచున ఆగ్నేయ కరేబియా ప్రాంతం

ఆగ్నేయ కరేబియన్‌ ప్రాంతం భీకర హరికేన్‌ (4వ తరగతి) ముప్పు ముంగిట నిలిచింది. ఆ ప్రాంతానికి సమీపంలో ఏర్పడిన బెరిల్‌ హరికేన్‌ దాని అనుకుని ఉన్న హరికేన్‌ను మరింత బలోపేతం చేస్తోందని అధికారులు తెలిపారు.

Published : 01 Jul 2024 05:21 IST

ప్యూర్టో రికో: ఆగ్నేయ కరేబియన్‌ ప్రాంతం భీకర హరికేన్‌ (4వ తరగతి) ముప్పు ముంగిట నిలిచింది. ఆ ప్రాంతానికి సమీపంలో ఏర్పడిన బెరిల్‌ హరికేన్‌ దాని అనుకుని ఉన్న హరికేన్‌ను మరింత బలోపేతం చేస్తోందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం బార్బడోస్, సెయింట్‌ లూసియా, గ్రెనడా, సెయింట్‌ విన్సెంట్, గ్రెనడైన్‌ దీవులపై ఉండనుంది. దీంతో  ఆ ప్రాంతాల్లోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు ఆదివారం విజ్ఞప్తి చేశారు. తూర్పు-ఆగ్నేయ బార్బడోస్‌కు 750 కిలోమీటర్ల దూరంలో బెరిల్‌ కేంద్రీకృతమైంది. గంటకు 155 కి.మీ. వేగంతో వీస్తున్న గాలులతో రెండో తరగతి హరికేన్‌గా గంటకు 33 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. ఇది సోమవారం తెల్లవారుజామున దక్షిణ బార్బడోస్‌ను దాటనుందని నేషనల్‌ హరికేన్‌ కేంద్రం తెలిపింది. భీకర హరికేన్‌ జమైకా, మెక్సికో దిశగా సాగుతోంది. ఇది మరో మూడు నాలుగు రోజులకు బలహీన పడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని