బొమ్మ తుపాకీతో పోలీసులకు బెదిరింపు

పోలీసుల నుంచి తప్పించుకోబోయి, బొమ్మ తుపాకీతో వారిని బెదిరించడంతో ఓ 13ఏళ్ల బాలుడిని న్యూయార్క్‌ అధికారి ఒకరు తుపాకీతో కాల్చిచంపారు. న్యూయార్క్‌లోని యుటికా నగరంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 01 Jul 2024 05:21 IST

అమెరికాలో బాలుడిని కాల్చి చంపిన అధికారి

న్యూయార్క్‌: పోలీసుల నుంచి తప్పించుకోబోయి, బొమ్మ తుపాకీతో వారిని బెదిరించడంతో ఓ 13ఏళ్ల బాలుడిని న్యూయార్క్‌ అధికారి ఒకరు తుపాకీతో కాల్చిచంపారు. న్యూయార్క్‌లోని యుటికా నగరంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయుధాలతో కూడిన ఓ దోపిడి కేసుకు సంబంధించి అధికారులు యుటికాలో విచారణ చేపట్టారు. ఆ సమయంలో అనుమానితులుగా ఉన్న ఇద్దరు మైనర్లను పోలీసులు అడ్డుకున్నారు. తర్వాతి రోజు కూడా వారిద్దరూ అదే ప్రాంతంలో ఉన్న రోడ్లపై రాత్రి 10 దాటినా తిరుగుతుండడంతో వారే నిందితులుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో నిందితుల్లో ఒకరైన న్యాహ్‌ ఎమ్‌వే అక్కడి నుంచి పరుగులు తీశాడు. పోలీసులు వెంబడించడంతో తన దగ్గరున్న బొమ్మ తుపాకీతో బాలుడు వారిని బెదిరించాడు. అది నిజమైన తుపాకీగా భావించి అధికారి ఒకరు బాలుడి ఛాతీ భాగంలో కాల్చాడు. దీంతో కింద పడిన అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రజలు నిరసనకు దిగడంతో ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు శనివారం విడుదల చేశారు. ఈ ఘటనలో పోలీసులు సరైన విధానాలను అనుసరించారా లేదా అన్న కోణంలో విచారణ చేపడతామని నగర మేయర్‌ విలియమ్స్‌ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని