ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. ఏడుగురి మృతి

దక్షిణ ఉక్రెయిన్‌లోని విల్నియాన్స్క్‌ పట్టణంపై శనివారం రాత్రి రష్యా ప్రయోగించిన క్షిపణులు ఏడుగురి ప్రాణాలను బలిగొన్నాయి. వీరిలో ముగ్గురు పిల్లలు. దాడిలో అనేకమంది గాయాలపాలయ్యారు.

Published : 01 Jul 2024 05:20 IST

కీవ్‌: దక్షిణ ఉక్రెయిన్‌లోని విల్నియాన్స్క్‌ పట్టణంపై శనివారం రాత్రి రష్యా ప్రయోగించిన క్షిపణులు ఏడుగురి ప్రాణాలను బలిగొన్నాయి. వీరిలో ముగ్గురు పిల్లలు. దాడిలో అనేకమంది గాయాలపాలయ్యారు. ఆదివారం సంతాపదినంగా పాటించారు. దాడిలో నివాస భవనాలు, కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రకటించారు. తూర్పు దొనెట్స్క్‌ ప్రాంతంలో జరిగిన దాడిలో 8 మంది పౌరులు చనిపోయినట్లు స్థానిక గవర్నర్‌ ప్రకటించారు. రష్యా దాడుల్ని తిప్పికొట్టేందుకు గగనతల రక్షణ వ్యవస్థల్ని, దీర్ఘ శ్రేణి ఆయుధాల సరఫరాను ఇంకా పెంచాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పాశ్చాత్య దేశాలను కోరారు. వారం రోజుల వ్యవధిలో 800 గ్లైడ్‌ బాంబులను రష్యా తమపైకి వేసిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తాము గురిపెట్టిన లక్ష్యాలపై పాశ్చాత్య దేశాలు విధించిన పరిమితుల్ని సడలించాలని కోరారు. తమపైకి బాంబుల్ని మోసుకువస్తున్న యుద్ధ విమానాలు ఎక్కడున్నా వాటిని నాశనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. టెరెట్స్క్‌ పట్టణంలో చెల్లాచెదురుగా మృతదేహాలు పడిఉన్న వీడియో దృశ్యాలను ఉక్రెయిన్‌ సైనిక వర్గాలు విడుదల చేశాయి. నైరుతి రష్యాలోని ఆరు ప్రాంతాల్లో మూడు డజన్లకు పైగా డ్రోన్లను తాము కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని