నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడులు

నైజీరియాలో శనివారం జరిగిన వరుస ఆత్మాహుతి దాడులు కలకలం రేపాయి. ఈ దాడుల్లో కనీసం 18 మంది మృతిచెందారు. 30 మంది తీవ్రంగా గాయపడగా.. వీరిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉంది.

Published : 01 Jul 2024 05:20 IST

18 మంది మృతి 

మైదుగురి: నైజీరియాలో శనివారం జరిగిన వరుస ఆత్మాహుతి దాడులు కలకలం రేపాయి. ఈ దాడుల్లో కనీసం 18 మంది మృతిచెందారు. 30 మంది తీవ్రంగా గాయపడగా.. వీరిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉంది. నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని బోర్నో రాష్ట్రం గ్వోజా పట్టణంలో జరిగిన ఈ ఘటనల్లో అనుమానాస్పద మహిళా ఆత్మాహుతి బాంబర్లు దాడులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మొదట.. గ్వోజా పట్టణంలో శనివారం సాయంత్రం జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో చిన్నారిని ఎత్తుకున్న ఓ మహిళ తనను తాను పేల్చుకున్నట్లు స్థానిక పోలీసులను ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ న్యూస్‌ కథనాన్ని ప్రచురించింది. తర్వాత అదే పట్టణంలోని జనరల్‌ ఆసుపత్రిలో మరో మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ రెండు దాడుల నుంచి తేరుకోక ముందే.. వివాహ కార్యక్రమంలో మరణించినవారి అంత్యక్రియల ఏర్పాట్లలో మూడో మహిళ తన శరీరానికి అమర్చుకున్న ఐఈడీని పేల్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని