స్మార్ట్‌ఫోన్‌ బుజ్జగింపులు పిల్లలకు అనర్థదాయకం

పిల్లలు ఒక్కోసారి తీవ్ర అసహనంతో ఊగిపోతుంటారు. అలాంటి సందర్భాల్లో వారిని సులువుగా దారికి తెచ్చుకోవడానికి సెల్‌ఫోన్‌ వంటి   డిజిటల్‌ సాధనాలను తల్లిదండ్రులు ఇస్తుంటారు.

Published : 29 Jun 2024 05:20 IST

దిల్లీ: పిల్లలు ఒక్కోసారి తీవ్ర అసహనంతో ఊగిపోతుంటారు. అలాంటి సందర్భాల్లో వారిని సులువుగా దారికి తెచ్చుకోవడానికి సెల్‌ఫోన్‌ వంటి   డిజిటల్‌ సాధనాలను తల్లిదండ్రులు ఇస్తుంటారు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయని పరిశోధకులు తేల్చారు. ఆ పిల్లలు పెద్దయ్యాక భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకునే సామర్థ్యాన్ని కోల్పోతారని పేర్కొన్నారు. స్వీయ నియంత్రణ, వివిధ అంశాలకు ప్రతిస్పందించాల్సిన తీరు వంటి లక్షణాలను పిల్లలు చిన్నప్పుడే చాలావరకూ నేర్చుకుంటారు. వీరిలో అప్పుడప్పుడూ చెలరేగే ప్రతికూల భావోద్వేగ స్పందనను కట్టడి చేయడానికి.. ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్‌లోని వీడియోలను చూపడం ఇటీవల బాగా పెరిగిపోతోంది. తద్వారా వారిని కొద్దిసేపు తల్లిదండ్రులు ఏమారుస్తున్నారు. దీనివల్ల ఆ చిన్నారులు.. భవిష్యత్‌లో భావోద్వేగాలను సమర్థంగా గుర్తించి, వాటిని అదుపులో ఉంచుకునే సామర్థ్యాన్ని కోల్పోయే అవకాశం ఉందని హంగరీ, కెనడా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. డిజిటల్‌ సాధనాలతో బుజ్జగింపునకు లోనయ్యే చిన్నారుల్లో కోపం, చికాకు నియంత్రణ నైపుణ్యాలు చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఇప్పటికే భావోద్వేగాలను సరిగా అదుపులో ఉంచుకోలేకపోతున్న పిల్లలను దారికి తెచ్చుకోవడానికి వారి తల్లిదండ్రులు ఎలక్ట్రానిక్‌ సాధనాలపై చాలా ఎక్కువగా ఆధారపడుతున్నట్లు కూడా తేలింది. ఈ పోకడ ఎంత పెరిగితే.. చిన్నారుల్లో ఇబ్బందులు అంత జఠిలమవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని