చాంగే-6 తెచ్చిన చందమామ నమూనాలు 2 కిలోలు

చంద్రుడి అవతలి భాగం నుంచి భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమనౌక చాంగే-6.. తన వెంట దాదాపు 2 కిలోల నమూనాలను తీసుకొచ్చింది.

Published : 29 Jun 2024 05:19 IST

బీజింగ్‌: చంద్రుడి అవతలి భాగం నుంచి భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమనౌక చాంగే-6.. తన వెంట దాదాపు 2 కిలోల నమూనాలను తీసుకొచ్చింది. వీటిని శోధించడం ద్వారా జాబిల్లి ఆవిర్భావ తీరుపై మరింత అవగాహన పెంచుకోవచ్చని చైనా అంతరిక్ష సంస్థ-సీఎన్‌ఎస్‌ఏ తెలిపింది. ‘‘ఈ వ్యోమనౌక 1,935.3 గ్రాముల మేర నమూనాలను తెచ్చినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలింది. గతంలో తెచ్చిన చందమామ శాంపిళ్లతో పోలిస్తే తాజాగా తెచ్చిన మట్టి ఒకింత అధిక సాంద్రతను కలిగి ఉంది. అందులో మట్టి ముద్దలు కూడా కనిపించాయి’’ అని పేర్కొంది. తొలుత ఈ నమూనాలను భద్రపరచడం, ప్రాసెసింగ్‌ వంటివి చేస్తామని, ఆ తర్వాత శాస్త్రీయ పరిశోధన పని మొదలవుతుందని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని