అమెరికాలో కొవిడ్‌ కేసులు

అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా కొవిడ్‌-19 కేసులు వెలుగుచూస్తుండడంతో ఇక్కడి సీడీసీ(సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌) అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Published : 29 Jun 2024 05:19 IST

వ్యాక్సినేషన్‌పై అధికారుల ప్రచారం

న్యూయార్క్‌: అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా కొవిడ్‌-19 కేసులు వెలుగుచూస్తుండడంతో ఇక్కడి సీడీసీ(సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌) అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం అట్లాంటాలో సమావేశమైన అధికారులు అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సిఫార్సు చేశారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసుల పెరుగుదల చూస్తుంటే రానున్న వేసవిలో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆరునెలల లోపు చిన్నారులు మినహాయించి మిగతావారంతా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఇది అన్ని రకాల ఫ్లూ వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ఈ నెల ప్రారంభంలో యూఎస్‌ ఎఫ్‌డీఏ(ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌) కొవిడ్‌ వెర్షన్‌ జేఎన్‌.1ను లక్ష్యంగా చేసుకుని వ్యాక్సిన్‌ తయారుచేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. వారం తర్వాత కేపీ.2ను లక్ష్యంగా చేసుకుని పనిచేసే మరింత నవీకరించిన వ్యాక్సిన్‌ను తయారుచేయాలని ఎఫ్‌డీఏ తయారీదారులకు సూచించే అవకాశం ఉంది. ఈ సరికొత్త వ్యాక్సిన్‌ ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అందుబాటులోకి వస్తుందని సీడీసీ అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని