500 కోట్ల మందిపై తీవ్రమైన వేడి ప్రభావం

వాతావరణ మార్పుల వల్ల జూన్‌లో తొమ్మిది రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని అమెరికాకు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం చేసిన తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది.

Published : 29 Jun 2024 05:17 IST

అందులో భారతీయులు 61.9 కోట్లు
తాజా అధ్యయనంలో వెల్లడి 

దిల్లీ: వాతావరణ మార్పుల వల్ల జూన్‌లో తొమ్మిది రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని అమెరికాకు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్తల బృందం చేసిన తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. ఇందులో 61.9 కోట్ల మంది భారతీయులూ ఉన్నారని వెల్లడించింది. వారి క్లైమేట్‌ సెంట్రల్‌ నివేదిక ప్రకారం.. జూన్‌లో బొబ్బలు వచ్చే వేడి వల్ల భారత్‌లో 61.9 కోట్ల మంది, చైనాలో 57.9 కోట్లు, ఇండోనేసియాలో 23.1 కోట్లు, నైజీరియాలో 20.6 కోట్లు, బ్రెజిల్‌లో 17.6 కోట్లు, బంగ్లాదేశ్‌లో 17.1 కోట్లు, అమెరికాలో 16.5 కోట్లు, ఐరోపాలో 15.2 కోట్లు, మెక్సికోలో 12.3 కోట్లు, ఇథియోపియాలో 12.1 కోట్లు, ఈజిప్టులో 10.3 కోట్ల మంది ఇబ్బందులు పడ్డారని వివరించింది. జూన్‌ 16 నుంచి 24వ తేదీ మధ్య ప్రపంచ జనాభాలో 60 శాతం మంది అధిక వేడిమిని భరించారని పేర్కొంది. భారత్‌లో ఈసారి అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల వల్ల 40 వేలకు పైగా వడదెబ్బ కేసులు, 100కు పైగా మరణాలు నమోదయ్యాయని నివేదిక తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని