క్షయ నిర్ధారణకు త్రీడీ వ్యవస్థ

మానవులు సహా క్షీరదాల ఊపిరితిత్తుల్లోని వాతావరణాన్ని పోలిన ‘త్రీడీ హైడ్రోజెల్‌ కల్చర్‌’ వ్యవస్థను బెంగళూరులోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌’ (ఐఐఎస్‌సీ) బయో ఇంజినీరింగ్‌ విభాగం విజయవంతంగా రూపొందించింది.

Published : 28 Jun 2024 05:19 IST

బెంగళూరు: మానవులు సహా క్షీరదాల ఊపిరితిత్తుల్లోని వాతావరణాన్ని పోలిన ‘త్రీడీ హైడ్రోజెల్‌ కల్చర్‌’ వ్యవస్థను బెంగళూరులోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌’ (ఐఐఎస్‌సీ) బయో ఇంజినీరింగ్‌ విభాగం విజయవంతంగా రూపొందించింది. క్షయ వ్యాధిని కలిగించే మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్‌ (ఎంటీబీ) క్రిములు ఊపిరితిత్తులను ఎలా దెబ్బతీస్తాయి, వాటిపై ఏయే మందులు ఎలా పనిచేస్తాయనే అంశాలను దీనిద్వారా నిర్ధారించవచ్చు. ప్రస్తుతం వాడుతున్న 2డి కల్చర్‌లో క్షయ కారక ఎంటీబీ ఎలా పెరుగుతుందో 7 రోజుల వరకు మాత్రమే గమనించగలం. త్రీడీ హైడ్రోజెల్‌ కల్చర్‌లో 3 వారాలవరకు అంటువ్యాధి వృద్ధిని వీక్షించవచ్చు. పైరజైనమైడ్‌ మందు క్షయ క్రిములపై ఎలా పనిచేస్తోందో కనిపెట్టవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని