కృత్రిమ మేధ సమాధానాలను గుర్తించడం కష్టమే

తరగతి గదిలో రోజూ పాఠాలు నేర్చుకుని పరీక్షలకు హాజరైన విద్యార్థుల కంటే కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బోట్‌లు అద్భుతంగా పరీక్షలు రాసేస్తున్నాయి! సమాధానాలను ఏఐతో రాసినట్లు గుర్తించడమే ఎగ్జామినర్లకు కష్టమవుతోంది.

Published : 28 Jun 2024 05:18 IST

దిల్లీ: తరగతి గదిలో రోజూ పాఠాలు నేర్చుకుని పరీక్షలకు హాజరైన విద్యార్థుల కంటే కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బోట్‌లు అద్భుతంగా పరీక్షలు రాసేస్తున్నాయి! సమాధానాలను ఏఐతో రాసినట్లు గుర్తించడమే ఎగ్జామినర్లకు కష్టమవుతోంది. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ రీడింగ్‌కి చెందిన కొందరు పరిశోధకులు 33 మంది కల్పిత విద్యార్థుల పేరిట చాట్‌జీపీటీ సమాధానాలను  సిద్ధం చేశారు. వాటిని అదే విశ్వవిద్యాలయంలోని ‘స్కూల్‌ ఆఫ్‌ సైకాలజీ అండ్‌ క్లినికల్‌ లాంగ్వేజ్‌ సైన్సెస్‌’ విభాగానికి చెందిన పరీక్షల నిర్వహణ వ్యవస్థకు పంపించారు. వాటిలో 94 శాతం సమాధానాల్లో.. రాసింది ఎవరనే తేడాను ఆ బృందం గుర్తించనే లేదు. అసలు విద్యార్థుల కంటే దాదాపు 83 శాతం చాట్‌బోట్లకే ఎక్కువ మార్కులు రావడం గమనార్హం. విద్యలో మదింపు వ్యవస్థనే ఏఐ ప్రభావితం చేస్తుందని, ఈ పరిణామం మన విద్యావేత్తలకు మేలుకొలుపు లాంటిదని పరిశోధకులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని