చంద్రుడి శిలలపై పరిశోధించండి

చంద్రుడి నుంచి చాంగే-6 వ్యోమనౌక తీసుకొచ్చిన శిలలపై పరిశోధనకు ముందుకు రావాలని వివిధ దేశాల శాస్త్రవేత్తలను చైనా అంతరిక్ష సంస్థ ఆహ్వానించింది.

Published : 28 Jun 2024 05:17 IST

విదేశీ శాస్త్రవేత్తలకు చైనా ఆహ్వానం

బ్యాంకాక్‌: చంద్రుడి నుంచి చాంగే-6 వ్యోమనౌక తీసుకొచ్చిన శిలలపై పరిశోధనకు ముందుకు రావాలని వివిధ దేశాల శాస్త్రవేత్తలను చైనా అంతరిక్ష సంస్థ ఆహ్వానించింది. కొన్ని షరతుల మేరకు వాటిపై పరిశోధనకు అవకాశమిస్తామని పేర్కొంది. ముఖ్యంగా అమెరికా విషయంలో తమకు కొన్ని పరిమితులు ఉంటాయని తెలిపింది. చాంగే మిషన్‌ విజయాలపై బీజింగ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చైనా అంతరిక్ష శాస్త్రవేత్తలు మాట్లాడారు. ‘నాసాతో చైనా శాస్త్రవేత్తలు ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోకుండా అమెరికా చట్టంలో నిబంధన ఉంది. ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం ఉండాలంటే ముందు అలాంటి వాటిని తొలగించాలి’ అని చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ వైస్‌ ఛైర్మన్‌ బియాన్‌ జిగాంగ్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని