అంతరిస్తున్న జీవజాతుల్లో మరో వెయ్యి

ప్రపంచంలో 45,000 జీవజాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని, ఇది గత ఏడాదికన్నా ఇది 1,000 ఎక్కువ అని ‘అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం’ (ఐయూసీఎన్‌) హెచ్చరించింది.

Published : 28 Jun 2024 05:17 IST

అబుజా (నైజీరియా): ప్రపంచంలో 45,000 జీవజాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని, ఇది గత ఏడాదికన్నా ఇది 1,000 ఎక్కువ అని ‘అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం’ (ఐయూసీఎన్‌) హెచ్చరించింది. వాతావరణ మార్పులు, అక్రమ వేట, అడవుల్లో నిర్మాణాలు, పరాయి జీవజాతుల చొరబాట్లే ఈ దుస్థితికి కారణమని పేర్కొంది. అంతరిస్తున్న జీవజాతుల సమాచారాన్ని ఐయూసీఎన్‌ గత 60 ఏళ్లుగా ఏటా ప్రచురిస్తోంది. సంరక్షణ చర్యల వల్ల ఐబీరియన్‌ లిన్‌క్స్‌ అనే మార్జాల జాతిని రక్షించగలిగామని తెలిపింది. చిలీ దేశంలోని అటకామా ఎడారిలో పెరిగే ఒక రకం బ్రహ్మజెముడు మొక్కలు, బోర్నియో ద్వీప ఏనుగులు, గ్రాన్‌ కెనారియా తొండ అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. చిలీ బ్రహ్మజెముడుకు అలంకరణ మొక్కగా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం జరగడమే దానికి ముప్పు తెచ్చిపెట్టిందని ఐయూసీఎన్‌ తెలిపింది. ఇప్పుడు ఈ మొక్క కోసం ఐరోపా, ఆసియా దేశాల సంపన్నులు ఎగబడుతున్నారు. బోర్నియో ఏనుగులు ఇప్పుడు కేవలం 1,000 మాత్రమే మనుగడలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని