జియోథర్మల్‌ విద్యుత్‌కు ఊతం

పర్యావరణ అనుకూల పద్ధతిలో విద్యుదుత్పత్తికి ఉద్దేశించిన ఒక విధానంలో క్రమంగా పురోగతి సాధ్యమవుతోంది. మంగళవారం ఈ రంగం ఒక కీలక మైలురాయి సాధించింది.

Published : 26 Jun 2024 05:50 IST

అమెరికాలో ఏర్పాటు కానున్న అతిపెద్ద కర్మాగారం 

శాక్రామెంటో: పర్యావరణ అనుకూల పద్ధతిలో విద్యుదుత్పత్తికి ఉద్దేశించిన ఒక విధానంలో క్రమంగా పురోగతి సాధ్యమవుతోంది. మంగళవారం ఈ రంగం ఒక కీలక మైలురాయి సాధించింది. భూ అంతర్భాగంలోని ఉష్ణంతో (జియోథర్మల్‌ పవర్‌) విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అతిపెద్ద కర్మాగారం అమెరికాలో ఏర్పాటు చేయనుండగా.. ఆ కరెంటును కొనుగోలు చేయాలని కాలిఫోర్నియాలోని ఒక విద్యుత్‌ పంపిణీ సంస్థ నిర్ణయించింది. ఈ ప్లాంట్‌ సామర్థ్యం 400 మెగావాట్లు. ఈ కరెంటు 4 లక్షల ఇళ్లకు సరిపోతుంది. ఫెర్వో ఎనర్జీ అనే సంస్థ జియోథర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయనుంది. దాన్ని సదరన్‌ కాలిఫోర్నియా ఎడిసన్‌ అనే విద్యుత్‌ పంపిణీ సంస్థ కొనుగోలు చేయనుంది. జియోథర్మల్‌ శక్తిని ఒడిసిపట్టడానికి ఉతా ప్రాంతంలో 125 బావులను ఫెర్వో సంస్థ తవ్వుతోంది. ఈ విధానంలో ఉత్పత్తయ్యే శుద్ధ విద్యుత్‌ వల్ల.. పర్యావరణానికి హాని కలిగించే ఇతర సంప్రదాయ విద్యుదుత్పత్తి కర్మాగారాలపై ఆధారపడటం తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని