కెనడా ప్రధాని ట్రూడోకు గట్టి ఎదురుదెబ్బ

మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న కెనడాలో ప్రధాని జస్టిన్‌ ట్రూడో నేతృత్వంలోని లిబరల్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Updated : 26 Jun 2024 06:17 IST

కంచుకోటలో లిబరల్‌ పార్టీ అభ్యర్థి ఓటమి

ఒటావా: మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న కెనడాలో ప్రధాని జస్టిన్‌ ట్రూడో నేతృత్వంలోని లిబరల్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి గత మూడు దశాబ్దాలుగా కంచుకోటగా నిలిచిన ‘టొరంటో-సెయింట్‌ పాల్స్‌’ పార్లమెంటు స్థానంలో ఓటమి ఎదురైంది. ఆ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో విపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ అభ్యర్థి డాన్‌ స్టీవార్ట్‌ గెలుపొందారు. అధికార లిబరల్‌ పార్టీ 1993 తర్వాత మొట్టమొదటి సారిగా ఈ స్థానంలో ఓటమి చవిచూసింది ఇప్పుడే. సోమవారం ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. లిబరల్‌ పార్టీ అభ్యర్థి లెస్లీ చర్చి ఓడిపోయారు. న్యూ డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేసిన భారతీయ సంతతికి చెందిన అమృత్‌ పర్హార్‌ మూడో స్థానంలో నిలిచారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు అధికార పార్టీకి షాక్‌ ట్రీట్‌మెంట్‌ వంటిదేనని కెనడా మీడియా సంస్థలు వ్యాఖ్యానించాయి. ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో తక్షణమే పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని విపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ అధినేత పియర్‌ పొయిలీవ్రా డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని