భార్య బ్యాగ్‌ తెచ్చిన తంటా

ఒక లగ్జరీ బ్యాగ్‌ దక్షిణ కొరియా అధికార పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఏప్రిల్‌లో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది.

Published : 27 Jan 2024 04:59 IST

దక్షిణ కొరియా అధ్యక్షుడికి పదవీ చిక్కులు

సియోల్‌: ఒక లగ్జరీ బ్యాగ్‌ దక్షిణ కొరియా అధికార పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఏప్రిల్‌లో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. ప్రథమ మహిళ ఖరీదైన బ్యాగ్‌ను బహుమతిగా పొందారంటూ వైరల్‌ అయిన దృశ్యాలు ఇందుకు కారణం. పీపుల్‌ పవర్‌ పార్టీకి చెందిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ సతీమణి పేరు కిమ్‌ కియోన్‌ హీ. ఆమెకు ఒక పాస్టర్‌ డియోర్‌ బ్యాగ్‌ ఇస్తున్నట్లు ఉన్న దృశ్యాలు గతేడాది విడుదలయ్యాయి. పాస్టర్‌ రహస్య కెమెరా ద్వారా దానిని చిత్రీకరించారు. బ్యాగ్‌ ఖరీదు 2,250 అమెరికన్‌ డాలర్లు అని తెలుస్తోంది. ఆ ఫుటేజీలో ఆమె బ్యాగ్‌ను స్వీకరిస్తున్నట్లు స్పష్టంగా లేకపోయినా.. ఆ గిఫ్ట్‌ గురించి అధ్యక్ష కార్యాలయం ధ్రువీకరించినట్లు మీడియా వెల్లడించింది. అలాగే దానిని ప్రభుత్వ ఆస్తి కింద భద్రపరిచినట్లు తెలిపింది. కొరియా చట్టాల ప్రకారం.. ఒకేసారి 750 యూఎస్‌ డాలర్లు లేక ఒక ఏడాదిలో 2,200 డాలర్ల విలువైన బహుమతులను స్వీకరించడం చట్టవిరుద్ధం. దాంతో ప్రస్తుతం ఈ అంశం అక్కడి రాజకీయాలను కుదిపేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని