Warren Buffett: చనిపోయాక ‘గేట్స్‌’కు విరాళాలు ఉండవు - వారెన్‌ బఫెట్‌

తాను చనిపోయిన తర్వాత బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌కు విరాళాలు ఉండవని ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్‌ బఫెట్‌ పేర్కొన్నారు.

Published : 30 Jun 2024 15:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్‌ బఫెట్‌ బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌కు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తూ వస్తున్నారు. ఇటీవల కూడా రూ.కోట్ల విలువైన షేర్లను కేటాయించారు. అయితే, తాను చనిపోయిన తర్వాత ఆ విరాళాలు ఉండవని చెప్పారు. వాటిని తన ముగ్గురు కుమారులు నిర్వహిస్తారని.. ఇందుకు సంబంధించి వీలునామాలో మార్పులు చేసినట్లు తాజా నివేదిక వెల్లడించింది.

‘‘నా మరణం తర్వాత బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు డబ్బులు రావు. నా పిల్లలకు వీటిని నిర్వహించగల సామర్థ్యం ఉందని విశ్వసిస్తున్నా’ అని వారెన్‌ బఫెట్‌ తన వీలునామాలో పేర్కొన్నారు. ఇప్పటికే వారు వేర్వేరు దాతృత్వ సంస్థలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తన మరణానంతరం ఆ వారసత్వాన్ని కొనసాగిస్తారని అన్నారు.

తొలుత పెళ్లి.. తర్వాత అంత్యక్రియలు.. వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి

సంపదలో 99శాతం తన కుటుంబానికి చెందిన నాలుగు దాతృత్వ సంస్థలతో పాటు బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కు కేటాయించినట్లు బఫెట్‌ గతంలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వీలునామాలో పేర్కొన్నారు. అయితే, వీలునామాను ఇప్పటికే పలుమార్లు సవరించిన ఆయన.. తన మరణానంతరం గేట్స్‌ ఫౌండేషన్‌కు వాటిని నిలిపివేయనున్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బఫెట్‌ పేర్కొన్నారు. ప్రస్తుతానికి మాత్రం బిల్‌గేట్స్‌ సంస్థకు విరాళాలు కొనసాగుతాయన్నారు. బెర్క్‌షైర్‌ హాత్‌వే అధినేత వారెన్‌ బఫెట్‌ సంపద విలువ సుమారు 130 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని