Rishi Sunak: సునాక్‌ విజయావకాశాలపై అనుమానం

బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీని గెలిపించగలరా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. గడచిన ఐదు వారాల ఎన్నికల ప్రచారంలో ఆయన వేసిన తప్పటడుగులే ఈ సందేహానికి బలం చేకూరుస్తున్నాయి.

Updated : 28 Jun 2024 06:24 IST

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీని గెలిపించగలరా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. గడచిన ఐదు వారాల ఎన్నికల ప్రచారంలో ఆయన వేసిన తప్పటడుగులే ఈ సందేహానికి బలం చేకూరుస్తున్నాయి. ఎన్నికలు జులై 4న జరుగుతాయని పందెం కాసిన సొంత పార్టీ అభ్యర్థులను ఆయన సస్పెండ్‌ చేయడం మొదటి విఘాతం. అన్నింటికన్నా పెద్ద పొరబాటు- ఈ నెల 6న ఫ్రాన్స్‌లోని నార్మండీలో జరిగిన డి-డే ఉత్సవ కార్యక్రమం నుంచి త్వరగా నిష్క్రమించడం. అది అమరవీరుల త్యాగాలను అగౌరవపరచడమేనని విమర్శలు వచ్చాయి. సునాక్‌ క్షమాపణ చెప్పినా అప్పటికే నష్టం జరిగిపోయింది. ప్రజాభిప్రాయ సేకరణల్లో సునాక్, ఆయన కన్జర్వేటివ్‌ పార్టీ రేటింగ్‌లు పడిపోతూ వచ్చాయి. 14 ఏళ్ల తరవాత తొలిసారి కన్జర్వేటివ్‌ పార్టీ ఓడిపోతుందని సర్వేలు సూచిస్తున్నాయి. ఇంతవరకు ఎన్నడూ ఓడిపోని సునాక్‌ ఈ ఎన్నికల్లో గెలుస్తారని భావించేవారూ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని