Rishi Sunak: సునాక్‌ భవితవ్యంపై ఉత్కంఠ!

భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్‌ భవితవ్యాన్ని తేల్చే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ గురువారం ఉదయం 7 గంటలకు బ్రిటన్‌లో ప్రారంభమైంది. దేశంలో మొత్తం 4.6 కోట్ల మంది ఓటర్లున్నారు.

Published : 05 Jul 2024 06:22 IST

బ్రిటన్‌లో ఓట్లేసిన కోట్ల మంది..

లండన్‌: భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్‌ భవితవ్యాన్ని తేల్చే సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ గురువారం ఉదయం 7 గంటలకు బ్రిటన్‌లో ప్రారంభమైంది. దేశంలో మొత్తం 4.6 కోట్ల మంది ఓటర్లున్నారు. 40,000 పోలింగ్‌ బూత్‌లను ఎన్నికల కోసం ఏర్పాటు చేశారు. 14ఏళ్ల కన్జర్వేటివ్‌ పార్టీకి, ప్రధాని రిషి సునాక్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. సునాక్‌తో లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌ తలపడుతున్నారు. ఉత్తర ఇంగ్లాండ్‌లోని రిచ్‌మండ్‌లో సతీమణి అక్షతా మూర్తితో కలిసి వచ్చిన 44 ఏళ్ల సునాక్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణి విక్టోరియాతో కలిసి వచ్చిన 61 ఏళ్ల స్టార్మర్‌ ఉత్తర లండన్‌లో ఓటేశారు. ఈసారి పోలింగ్‌ తక్కువగా నమోదయ్యే అవకాశముందని భావిస్తున్నారు.

లేబర్‌ పార్టీని అడ్డుకోకుంటే అధిక పన్నులు చెల్లించాల్సిన పరిస్థితిని ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఓటేసిన అనంతరం సునాక్‌ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ పట్ల ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. విపక్ష లేబర్‌ పార్టీవైపు ఈసారి ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 14 ఏళ్లపాటు అప్రతిహతంగా బ్రిటన్‌ను ఏలిన కన్జర్వేటివ్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఫలితాలెప్పుడు?

బ్రిటన్‌ కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు పోలింగ్‌ ముగుస్తుంది. ఆ వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ప్రకటిస్తారు. పోలింగ్‌ ముగిసిన కాసేపటికే కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. అక్కడి కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రికి (భారత్‌లో శుక్రవారం తెల్లవారుజామున) తొలి ఫలితం వెలువడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని