Biden: పోటీలో కొనసాగనున్న బైడెన్‌!

డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిగిన సంవాదంలో పేలవమైన పనితీరు కారణంగా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఒత్తిడిని ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌.. తాను వెనక్కి తగ్గకపోవచ్చన్న సంకేతాలను సోమవారం ఇచ్చారు.

Published : 02 Jul 2024 05:35 IST

వాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌తో జరిగిన సంవాదంలో పేలవమైన పనితీరు కారణంగా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఒత్తిడిని ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌.. తాను వెనక్కి తగ్గకపోవచ్చన్న సంకేతాలను సోమవారం ఇచ్చారు. వార్ధక్యంతో వచ్చిన తన ఇబ్బందులను ఆయన అంగీకరించారు. అయితే నిజాలు మాట్లాడటం ఒక్కటే తనకు తెలుసని చెప్పారు.  త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ట్రంప్, డెమోక్రటిక్‌ పార్టీ పక్షాన బైడెన్‌లు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం రాత్రి అట్లాంటాలో వీరిద్దరి మధ్య 90 నిమిషాల పాటు జరిగిన సంవాదంలో బైడెన్‌ పలుమార్లు తడబడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బైడెన్‌ కుటుంబ సభ్యులు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందులో భార్య జిల్, కుమారుడు హంటర్, మనుమలు సహా పలువురు పాల్గొన్నారు. మరోసారి అధ్యక్ష పదవిని దక్కించుకోవడానికి పోరాటాన్ని కొనసాగించాల్సిందిగా బైడెన్‌కు వారంతా సూచించినట్లు వార్తలు వచ్చాయి. బాసటగా ఉంటామని ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని