LGBTQ couples: అమెరికా సాక్షిగా.. హాంకాంగ్‌లో ఒక్కటైన 10 స్వలింగ జంటలు

పది స్వలింగ జంటలు హాంకాంగ్‌లోని ఒక హోటల్‌ హాలులో సమావేశమై ఇంటర్నెట్‌ ద్వారా అమెరికాలోని అధికారి ఆధ్వర్యంలో వివాహబంధంలోకి అడుగుపెట్టాయి.

Published : 27 Jun 2024 05:36 IST

- వీడియో చాట్‌తో వివాహాల నమోదు

హాంకాంగ్‌: పది స్వలింగ జంటలు హాంకాంగ్‌లోని ఒక హోటల్‌ హాలులో సమావేశమై ఇంటర్నెట్‌ ద్వారా అమెరికాలోని అధికారి ఆధ్వర్యంలో వివాహబంధంలోకి అడుగుపెట్టాయి. ఇటువంటి జంటలను అధికారికంగా గుర్తించని హాంకాంగ్‌ వారికి చట్టపరమైన రక్షణను మాత్రం కల్పిస్తుంది. హాంకాంగ్‌లోని కౌలూన్‌ పట్టణంలో మంగళవారం జరిగిన ఈ వివాహాలను దాదాపు 11 వేల కి.మీ.ల దూరాన ఉన్న అమెరికాలోని యూటా రాష్ట్ర అధికారి రిజిస్టరు చేశారు. సాధారణంగా అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో ఇటువంటి వివాహాలకు ఆయా జంటలు భౌతికంగా హాజరై అధికారిక లాంఛనాలను పూర్తిచేయాల్సి ఉంటుంది. కొవిడ్‌-19 అనంతరం యూటా రాష్ట్రంలో మాత్రం డిజిటల్‌ దరఖాస్తుల ద్వారా ఆన్‌లైన్‌ పెళ్లిళ్లకు అనుమతిస్తున్నారు. ఆయా కుటుంబాల సభ్యులు హాజరైన ఈ వేడుకలో పది జంటలు సంబరంగా ఉంగరాలు మార్చుకున్నాయి. స్వలింగ జంటల పెళ్లిళ్లకు హాంకాంగ్‌లో రిజిస్ట్రేషను విధానం లేనందున, ఈ విధంగా వారి కలలను తాము నిజం చేస్తున్నట్లు ఈ వివాహాల నిర్వాహకుడైన కర్ట్‌ టంగ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని