Plane Crash: విమానం కూలి తొమ్మిది మంది మృతి

సూడాన్ (Sudan)లో సాంకేతిక లోపంతో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు.

Published : 24 Jul 2023 06:05 IST

ఖార్తూమ్‌: సూడాన్ (Sudan)లో సాంకేతిక లోపంతో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ సైన్యం ధ్రువీకరించింది. పౌరులతో వెళ్తున్న విమానం టేకాఫ్‌ సమయంలో సాంకేతిక లోపం తలెత్తి కూలినట్లు వెల్లడించింది. మృతుల్లో నలుగురు సైనిక సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృత్యుంజయురాలిగా బయటపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని