Plane Crash: కుప్పకూలిన విమానం.. పైలట్‌ సహా ఆరుగురి మృతి

కొలంబియాలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌ సహా ఐదుగురు రాజకీయ నాయకులు దుర్మరణం పాలయ్యారు.

Updated : 20 Jul 2023 05:25 IST

బొగొటా: కొలంబియాలో ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌ సహా ఐదుగురు రాజకీయ నాయకులు దుర్మరణం పాలయ్యారు. వీరు కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబ్‌కు చెందిన పార్టీలో సభ్యులుగా ఉన్నారు. తమ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి విల్లావిసెన్సియో నుంచి బొగొటాకు విమానంలో ప్రయాణింస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆ దేశ సివిల్‌ ఎవియేషన్‌ అథారిటీ దర్యాప్తు చేపట్టింది. ప్రమాదంలో మృతిచెందిన నాయకులకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో, పార్టీ నేతలు సంతాపం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని