South Africa: దక్షిణాఫ్రికాలో 34 వేల ఏళ్ల పురాతన చెదపుట్టలు

ఇప్పటికీ చెద పురుగులు నివసిస్తున్న అతి పురాతనమైన చెదపుట్టలను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు నమోదైనవాటిలో ఇవే పురాతనమైనవని పేర్కొన్నారు.

Published : 05 Jul 2024 04:56 IST

పురాతన చెదపుట్ట వద్ద స్టెలెన్‌బాష్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త మిషెల్‌ ఫ్రాన్సిస్‌ తదితరులు 

కేప్‌టౌన్‌: ఇప్పటికీ చెద పురుగులు నివసిస్తున్న అతి పురాతనమైన చెదపుట్టలను దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటివరకు నమోదైనవాటిలో ఇవే పురాతనమైనవని పేర్కొన్నారు. నమక్వాలాండ్‌ ప్రాంతంలో బఫెల్స్‌ నది తీరంలో ఉన్న కొన్ని చెదపుట్టల వయసు 34 వేల ఏళ్లని రేడియో కార్బన్‌ డేటింగులో వెల్లడైనట్లు స్టెలెన్‌బాష్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి పాతవని తెలుసు కానీ, ఇంత పురాతనమైనవని అనుకోలేదని అధ్యయనంలో పాల్గొన్న మిషెల్‌ ఫ్రాన్సిస్‌ అన్నారు. ఇక్కడ ఉన్న చెదపుట్టలు సగటున వంద అడుగుల ఎత్తు, భూమి లోపల పది అడుగుల లోతు వరకు ఉంటాయని తెలిపారు. ఇప్పటివరకు బ్రెజిల్‌లో కనుగొన్న 4 వేల ఏళ్లనాటి చెదపుట్టలనే అతి పురాతనమైనవిగా భావించేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని