Pakistan: పెషావర్‌లో మారణహోమం.. 56కి చేరిన మృతులు!

పాకిస్థాన్‌లోని పెషావర్ బాంబు పేలుడుతో దద్దరిల్లింది.  కొచా రిసాల్డర్‌ ప్రాంతంలోని ఓ మసీదులో జరిగిన ఘోర ఘటనలో మృతుల సంఖ్య 56కి చేరింది.....

Published : 04 Mar 2022 19:55 IST

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని పెషావర్ బాంబు పేలుడుతో దద్దరిల్లింది.  కొచా రిసాల్డర్‌ ప్రాంతంలోని ఓ మసీదులో జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య 56కి చేరింది. ఈ ఘటనలో దాదాపు 194 మందికి పైగా గాయపడినట్టు లేడీ రీడింగ్‌ ఆస్పత్రి (ఎల్అ‌ర్‌హెచ్‌) అధికార ప్రతినిధి మహమ్మద్‌ అసీం వెల్లడించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇది ఆత్మాహుతిదాడిగా తెలుస్తోంది. మసీదులోకి వెళ్లే ముందు బయట ప్రధాన ద్వారం వద్ద పహారా కాస్తున్న వారిపై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులకు తెగబడగా.. ఓ పోలీసు కానిస్టేబుల్‌ మృతిచెందినట్టు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. మరో పోలీసు అధికారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ పేలుడుకు దాదాపు ఐదారు కిలోల పేలుడు పదార్థాలు వినియోగించినట్టు తెలిపారు. శుక్రవారం ప్రార్థనల నిమిత్తం ప్రజలు గుమిగూడిన సమయంలో ఈ పేలుడు సంభవించడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈ పేలుడు ఘటనతో మసీదులో శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిఉండటంతో పాటు ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని