Sri Lanka: శ్రీలంకలో 137 మంది భారతీయుల అరెస్టు.. ఎందుకంటే!

ఆన్‌లైన్‌ వేదికగా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గురువారం ఒక్కరోజే 137 మంది భారతీయులను శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు.

Published : 28 Jun 2024 23:41 IST

కొలంబో: ఆర్థిక నేరాలపై శ్రీలంక (Sri Lanka) ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆన్‌లైన్‌ వేదికగా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గురువారం ఒక్కరోజే 137 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజధాని కొలంబో శివార్లలోని మడివేలా, బత్తరముల్లాతోపాటు నెగొంబో తదితర ప్రాంతాల్లో సీఐడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 158 ఫోన్లు, 16 ల్యాప్‌టాప్‌లు, 60 కంప్యూటర్లను జప్తు చేసినట్లు పోలీసులను ఉటంకిస్తూ ఓ వార్తాసంస్థ తెలిపింది.

నాన్న చనిపోయాడని కట్టుకథ.. అమెరికాలో భారత విద్యార్థి బహిష్కరణ

సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించవచ్చని నమ్మించి మోసం చేశారని ఆరోపిస్తూ ఓ బాధితుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే బాధితుల ద్వారా బలవంతంగా నగదు డిపాజిట్లు చేయిస్తోన్న విషయం వెలుగులోకి వచ్చింది. సీఐడీ అధికారులు నెగొంబోలోని ఓ విలాసవంతమైన ఇంటిపై దాడి చేయగా.. కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. తీగలాడితే డొంక కదిలిందన్న చందంగా.. దుబాయ్‌, అఫ్గానిస్థాన్‌ వంటి దేశాల్లోనూ వీరి కార్యకలాపాలు బయటపడ్డాయి. వీరు ఆర్థిక అవకతవకలు, అక్రమ బెట్టింగ్‌, జూదం వంటి నేరాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని