- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ఉన్నట్లుండి బరువు పెరిగినా, తగ్గినా.. జాగ్రత్త పడాల్సిందే!
కొంతమంది ఉన్నట్లుండి బరువు పెరిగిపోతుంటారు.. ఇలా ఎందుకు జరుగుతోందా అని ఆందోళన పడుతూ, బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే, బరువు పెరగడమే కాదు.. ఉన్నట్లుండి బరువు తగ్గినా కూడా ఇబ్బందే..!
కొంతమంది ఉన్నట్లుండి బరువు పెరిగిపోతుంటారు.. ఇలా ఎందుకు జరుగుతోందా అని ఆందోళన పడుతూ, బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే, బరువు పెరగడమే కాదు.. ఉన్నట్లుండి బరువు తగ్గినా కూడా ఇబ్బందే..! ప్రత్యేకించి ఎలాంటి ప్రయత్నం లేకుండా ఇలా ఉన్నట్లుండి బరువు పెరిగినా, తగ్గినా- వెంటనే అలర్ట్ కావాలంటున్నారు నిపుణులు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలే ఇందుకు కారణం కావచ్చని వారు సూచిస్తున్నారు. ఈ క్రమంలో- సడన్‌గా బరువు పెరగడానికి, తగ్గడానికి దారితీసే కొన్ని కారణాలేంటో తెలుసుకుందాం..
ఎందుకు పెరుగుతామంటే..?
⚛ శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో మార్పుల కారణంగా జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుంది. ఇది ఒక్కసారిగా బరువు పెరిగేందుకు దోహదం చేస్తుంది. అలాగే ఈ హార్మోన్ల అసమతుల్యత పీసీఓఎస్కూ దారితీస్తుంది. ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
⚛ ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ.. వంటి మానసిక సమస్యల బారిన పడినప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తవుతుంది. ఒక్కోసారి దీనివల్ల కూడా పొట్టభాగంలో బరువు పెరుగుతుందంటున్నారు నిపుణులు.
⚛ డీహైడ్రేషన్ సమస్య తలెత్తినప్పుడు అలసట ఆవహిస్తుంది.. దాన్ని గ్రహించలేక మన శరీరం ఆకలి అని పొరబడుతుందట! ఫలితంగా ఏది పడితే అది తినడం వల్ల కూడా ఎక్కువగా బరువు పెరిగిపోతామంటున్నారు నిపుణులు. కాబట్టి శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా జాగ్రత్తపడడం మంచిదంటున్నారు.
⚛ ఒత్తిడి తగ్గించే మందులు, గర్భ నిరోధక మాత్రలు.. వంటి మందులు కూడా కొంతమందిలో శరీర బరువు పెరగడానికి దోహదం చేస్తాయట!
⚛ నెలసరి వల్ల కూడా కొంతమంది బరువు పెరుగుతారంటున్నారు నిపుణులు. ఇందుకు.. రుతుక్రమం సమయంలో శరీరం నీరు నిలుపుకోవడం ఓ కారణమైతే, ఈస్ట్రోజెన్-ప్రొజెస్టరాన్.. వంటి హార్మోన్ల స్థాయుల్లో మార్పులు మరో కారణమంటున్నారు.
ఎందుకు తగ్గచ్చు?
⚛ థైరాయిడ్ గ్రంథి చురుగ్గా ఉండి ఎక్కువ మొత్తంలో థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేసే దశను హైపర్ థైరాయిడిజంగా పేర్కొంటారు. ఈ క్రమంలో శరీరంలోని క్యాలరీలు ఎక్కువగా కరిగిపోతాయి. ఫలితంగా బరువు కూడా అధికంగానే తగ్గే అవకాశం ఉంటుందట.
⚛ డిప్రెషన్ మెదడులోని కొన్ని భాగాలపై ప్రతికూల ప్రభావం చూపి ఆకలిని తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు. అయితే ఈ సమస్య అందరిలో ఒకేలా ప్రభావం చూపచ్చు.. చూపకపోవచ్చంటున్నారు.
⚛ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ సమస్య. అంటే.. మన రోగనిరోధక వ్యవస్థ మన శరీర అవయవాల పైనే దాడి చేయడమన్నమాట! ఈ క్రమంలో ఆకలి మందగించడం, పొట్టలో వాపు.. వంటి దుష్ప్రభావాల వల్ల శరీరానికి తగిన పోషకాలు అందవు. ఇది కూడా బరువు తగ్గేందుకు దారి తీస్తుందట.
⚛ మధుమేహం ఉన్న వారిలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాక.. శరీరం శక్తి కోసం కొవ్వులు, కండరాల మీద ఆధారపడుతుంది. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుందట.
వివిధ రకాల అనారోగ్య సమస్యలతో పాటు హార్మోన్లలో, మన జీవనశైలిలో మార్పుల కారణంగా శరీర బరువులో హెచ్చుతగ్గులనేవి సహజం అంటున్నారు నిపుణులు. అయితే మీ అలవాట్లలో మార్పులు లేకపోయినా, ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ అనుసరిస్తోన్నా, వెంటవెంటనే బరువులో హెచ్చుతగ్గులు గమనిస్తే మాత్రం ఓసారి డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స, సలహాలు తీసుకోవడం మంచిదంటున్నారు. అలాగే శరీరాకృతితో సంబంధం లేకుండా మనల్ని మనం స్వీకరించడం, అంగీకరించడం అన్నింటికన్నా ముఖ్యం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- జుట్టు రాలుతోందా? ఈ చిట్కాలు మీకోసమే..!
- ఇంట్లోనే హెర్బల్ బ్లీచ్.. ఇలా!
- మెడ పైన ముడతలు.. తగ్గాలంటే..!
- గాజుల రాజసం!
- ఎలా వాడాలో తెలుసా!
ఆరోగ్యమస్తు
- గర్భాశయం అలా ఉంటే .. పిల్లలు పుడతారా?
- ఉన్నట్లుండి బరువు పెరిగినా, తగ్గినా.. జాగ్రత్త పడాల్సిందే!
- డ్రాగన్ పండు... పోషకాలు మెండు!
- ఒత్తిడికి యాప్స్..!
- ఈ కాలంలో వచ్చే వ్యాధులను ఎదుర్కోవాలంటే..!
అనుబంధం
- తెలివితేటల్లో... ఇరుగూపొరుగూ!
- నా వల్లే పెళ్లి చేసుకోవట్లేదా..?
- Adoption: పిల్లల్ని దత్తత తీసుకున్నారా?
- ఇబ్బందే... అయినా సమాధానం చెప్పాలి
- బాధ్యత తెలుసుకుని నడిస్తేనే...
యూత్ కార్నర్
- AI Dress: అమ్మాయిల వైపు కన్నెత్తి చూశారో.. ఇక అంతే!
- పరిమళాలు... రూ.కోట్లు వెదజల్లుతున్నాయి!
- ఫుట్‌బాల్ ఆటలో తొలి అనలిస్ట్‌గా... అంజిత!
- గిటార్‌తో ‘మాయ’ చేస్తూ..!
- Self-confidence: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?
'స్వీట్' హోం
- టీ తాగుతున్నా... బరువు పెరుగుతానా?
- నాన్‌స్టిక్ పాత్రలు వాడుతున్నారా?
- నిమ్మ... కుండీలోనూ పెరుగుతుందమ్మ!
- శ్రీవారూ... ఇలా ఉంటారా మీరూ!
- ఈ స్టీలు గ్లాసుని మడతపెట్టొచ్చు...
వర్క్ & లైఫ్
- Hina Khan: అటు నుంచి అటే.. కీమోథెరపీకి వెళ్లా!
- నైపుణ్యాలు పెంచుకుంటున్నారా..?
- Alia Bhatt: నా బిడ్డ కోసం రోజూ ఇలా చేస్తున్నా.. మరి మీరు?!
- ఉద్యోగమే జీవితమైపోయింది.. తోలుబొమ్మలా అలసిపోతున్నా!
- గృహిణిగా ఉండమంటే.. భర్త కంపెనీలో వాటా అడిగింది!