ముఖంపై జిడ్డుదనం తగ్గాలంటే..

నా ముఖంపై ఎక్కువ నల్ల మచ్చలున్నాయి. ఎనిమిది నెలల క్రితం నాకు పొంగు చూపింది. అప్పటినుంచి ముఖం ఎప్పుడూ జిడ్డుగా కనిపిస్తుంది. దీనికి పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పండి. - ఓ సోదరి

Published : 27 Jun 2024 12:25 IST

నా ముఖంపై ఎక్కువ నల్ల మచ్చలున్నాయి. ఎనిమిది నెలల క్రితం నాకు పొంగు చూపింది. అప్పటినుంచి ముఖం ఎప్పుడూ జిడ్డుగా కనిపిస్తుంది. దీనికి పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పండి. - ఓ సోదరి

జ: పొంగు చూపిన తర్వాత మీ ముఖం ఎప్పుడూ జిడ్డుగా కనిపిస్తుందని రాశారు. అందుకే ముందుగా మీ ముఖంపై ఉండే జిడ్డును తొలగించుకోవడానికి సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ వేసుకోవాలి. ఇందుకోసం అర టేబుల్‌స్పూన్‌ చొప్పున చందనం, ముల్తానీ మట్టి తీసుకొని.. ఈ రెండింటినీ రోజ్‌వాటర్‌లో కలుపుకుంటూ ప్యాక్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే జిడ్డుదనం తొలగిపోతుంది.

అలాగే మీ ముఖంపై ఉన్న నల్ల మచ్చల్ని తొలగించుకోవడానికి మంచి నాణ్యమైన తేనె తీసుకోవాలి. దీన్ని నల్ల మచ్చలున్న చోట నేరుగా అప్లై చేసుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఇలా రోజూ క్రమం తప్పకుండా చేయడం వల్ల ఆ నల్ల రంగు మచ్చలు తేనె రంగులోకి మారతాయి. ఆపై క్రమక్రమంగా చర్మ రంగులో కలిసిపోతాయి. అయితే ఈ మచ్చలు అంత త్వరగా తగ్గవు కాబట్టి.. ఓపిగ్గా నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ చిట్కా పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్