ఇంటికి వన్నె తెచ్చే ప్లాంటర్స్!

ఇంటిని అందంగా, ఆహ్లాదంగా మార్చడంలో మొక్కలు ముందు వరుసలో ఉంటాయి. అందుకే చాలామంది ఇండోర్‌ మొక్కల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే వీటిని సాధారణ కుండీల్లో కాకుండా కాస్త వెరైటీగా, ఆకర్షణీయంగా....

Published : 17 Jun 2023 17:31 IST

ఇంటిని అందంగా, ఆహ్లాదంగా మార్చడంలో మొక్కలు ముందు వరుసలో ఉంటాయి. అందుకే చాలామంది ఇండోర్‌ మొక్కల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే వీటిని సాధారణ కుండీల్లో కాకుండా కాస్త వెరైటీగా, ఆకర్షణీయంగా ఉండే కుండీల్లో ఏర్పాటు చేసుకుంటే ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు. అలాంటి ఆకర్షణీయమైన హోమ్‌ డెకరేటివ్‌ ప్లాంటర్స్‌ ఇప్పుడు మార్కెట్లో విభిన్న ఆకృతుల్లో దొరుకుతున్నాయి.

బుజ్జి బుజ్జి పక్షులు, బొమ్మలు, జంతువుల ఆకృతుల్లో కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దినవి, పండ్ల ఆకృతుల్ని పోలి ఉన్నవి, పెబుల్‌ స్టోన్‌ మాదిరిగా రూపుదిద్దుకున్నవి, ఊయల తరహాలో వేలాడదీసినవి, జ్యూట్‌/వెదురు/చెక్క.. వంటి పర్యావరణహిత మెటీరియల్‌తో రూపొందించినవి, సెరామిక్‌తో డిజైన్‌ చేసినవి, గోడలకు లేదంటే ఫ్రిజ్‌/ఫర్నిచర్‌కు వేలాడదీసేలా తయారుచేసిన విభిన్న మ్యాగ్నటిక్‌ ప్లాంటర్స్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని డిజైన్లలో ఇవి కొలువుదీరాయి. వీటిలో కొన్ని షోకేస్‌ మొక్కలతో కూడిన ప్లాంటర్స్‌ కాగా, మరికొన్ని కేవలం ప్లాంటర్స్‌ మాత్రమే దొరుకుతున్నాయి. వీటిని ఇంటికి తెచ్చుకొని, మట్టి నింపుకొని.. అందులో ఇండోర్‌ ప్లాంట్స్‌ని అమర్చుకుంటే సరిపోతుంది. వీటితో ఇటు ఇంటికి అందం.. అటు మనసుకు ఆహ్లాదం.. రెండూ సొంతమవుతాయి. మరి, అలాంటి కొన్ని బ్యూటిఫుల్‌ ఇండోర్‌ ప్లాంటర్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్