- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
మా బాస్.. తనతో సంబంధం పెట్టుకోమంటున్నాడు..!
నేను ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. మా బాస్ నాతో ప్రవర్తించే విధానం ఇబ్బందిగా ఉంటోంది. అతనితో సంబంధం పెట్టుకోవాలని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం నేను చేస్తోన్న ఉద్యోగం నాకు ఎంతో ముఖ్యం. దాంతో అతన్ని ఏమీ చేయలేకపోతున్నా. అతనికి పెళ్లైంది.
(Representational Image)
నేను ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. మా బాస్ నాతో ప్రవర్తించే విధానం ఇబ్బందిగా ఉంటోంది. అతనితో సంబంధం పెట్టుకోవాలని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం నేను చేస్తోన్న ఉద్యోగం నాకు ఎంతో ముఖ్యం. దాంతో అతన్ని ఏమీ చేయలేకపోతున్నా. అతనికి పెళ్లైంది. అతనికి పెద్దవాళ్లతో పరిచయం కూడా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. పని ప్రదేశంలో వివిధ రకాల మనస్తత్వాలు ఉన్నవాళ్లు ఎదురవుతుంటారు. అలాగే వివిధ రకాల సమస్యలు, సవాళ్లు కూడా ఉంటాయి. మహిళలుగా వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో- మీ బాస్ తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నాడని అంటున్నారు. ఉద్యోగం అనేది మీరు చేసే పని పైన, మీ ప్రతిభా సామర్ధ్యాల పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి, భయపడకుండా మీ పని పైనే ఎక్కువ ఏకాగ్రత పెట్టడానికి ప్రయత్నించండి.
సాధారణంగా వివిధ సంస్థల నిబంధనలు.. పని ప్రదేశంలో సహోద్యోగులతో ఎలాంటి అనుచిత సంబంధాలు కలిగి ఉండడానికి అంగీకరించవు. ఇలాంటి సంబంధాలు పని వాతావరణంలో ఎన్నో రకాలుగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అందులోనూ అతనికి పెళ్లైందని అంటున్నారు. కాబట్టి, పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఇలాంటి సంబంధాలు ఎవరికీ మంచివి కావు.
ఈ క్రమంలో మీ సమస్యంతా మీ బాస్తోటే కాబట్టి నేరుగా అతనితోనే చర్చించే ప్రయత్నం చేయండి. అతనితో వృత్తిగత సంబంధానికి మించి ఇతర సంబంధాలు పెట్టుకోవడానికి సుముఖంగా లేరన్న విషయాన్ని స్పష్టం చేయండి. అయినా తను మారకపోతే పని ప్రదేశంలో వివక్ష, లైంగిక వేధింపులకు సంబంధించిన నిబంధనలు/చట్టాల గురించి గుర్తు చేయండి. ఒకవేళ అప్పటికీ అతను అదే పద్ధతిని కొనసాగిస్తుంటే మాత్రం మానవ వనరుల విభాగం వారికి ఫిర్యాదు చేయండి. ఈ క్రమంలో- అతని మాటలు, నడవడికకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని కూడా అందించే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోనిబ్బరాన్ని కోల్పోవద్దు. ధైర్యంగా ఉండండి. సమస్య కచ్చితంగా పరిష్కారమవుతుంది. ఈ క్రమంలో అవతలి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి.
అలాగే ఈ ఆలోచనల నుంచి ఇంకా బయటకు రాలేకుండా ఆందోళనకు గురవుతుంటే మానసిక నిపుణులను సంప్రదించండి. వారు తగిన సలహా సూచిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- జుట్టు ఆరోగ్యానికి అవిసె గింజలు..!
- అమ్మాయిలు మెచ్చే ‘లోఫర్స్’
- ముఖంపై జిడ్డుదనం తగ్గాలంటే..
- మొటిమలను తగ్గించే నూనె!
- అందంగా మెరిసేందుకు.. అయిదు చిట్కాలు..!
ఆరోగ్యమస్తు
- హార్మోన్లు సమతులంగా.. ఉండాలంటే..!
- పోనీ ఇలా తాగండి!
- ప్రసవ సమయంలో... తినొచ్చా?
- తేనీటితో... తగ్గొచ్చా?
- ఆర్థరైటిస్... ఉపశమనమిలా
అనుబంధం
- ప్రతి విషయాన్నీ తన తల్లికి చెబుతున్నాడు..!
- ఆలయం థీమ్‌తో ఆహ్వానం..!
- Rama Rajamouli: అందుకే మా అనుబంధం దృఢంగా ఉంది..!
- బ్రేకప్ చెబుతున్నారా?
- మా బాస్.. తనతో సంబంధం పెట్టుకోమంటున్నాడు..!
యూత్ కార్నర్
- Radhika-Anant: అంబానీ వారి పెళ్లి శుభలేఖ.. అదుర్స్!
- సాగు పరికరాలు... బతుకునిచ్చాయి!
- 6 రోజులు.. 680 కిలోమీటర్లు!
- పొలం అమ్మి... రాజధానికి ఇచ్చా
- వడాపావ్‌తో... రోజుకి రూ.నలభై వేలు!
'స్వీట్' హోం
- అమ్మ మీద అరిచేస్తున్నా!
- పూజా సామగ్రితో సంస్కారా హోమ్!
- టొమాటోకు బదులుగా ఇవి..!
- మార్పు మన నుంచే..!
- టొమాటో పండిద్దాం రండి!
వర్క్ & లైఫ్
- మన మహిళా ఎంపీల.. ‘పార్లమెంట్ ఫ్యాషన్’ స్టైల్!
- Renu Desai: మీకు కుటుంబాల్లేవా? ఇకనైనా వీటిని ఆపండి!
- చదువా... పిల్లలా?
- ఆరు తరాలు.. 185 మంది.. ఒకే ఇంట్లో..!
- ఆ దేశంలో పిల్లలకు నాలుగంచెల లంచ్ బాక్స్!