ఆలయం థీమ్‌తో ఆహ్వానం..!

అనంత్‌ అంబానీ, రాధికల ముందుస్తు వివాహ వేడుకల్ని గత రెండేళ్ల నుంచీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న వాళ్ల పెళ్లి వేడుకలు... ‘శుభ్‌ వివాహ్‌’ పేరుతో జులై 12 నుంచి  జరగనున్నాయట. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోడలు స్మిత రాకేష్‌ ఆ ఆహ్వాన పత్రిక వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 28 Jun 2024 02:45 IST

ట్రెండింగ్‌

నంత్‌ అంబానీ, రాధికల ముందుస్తు వివాహ వేడుకల్ని గత రెండేళ్ల నుంచీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న వాళ్ల పెళ్లి వేడుకలు... ‘శుభ్‌ వివాహ్‌’ పేరుతో జులై 12 నుంచి  జరగనున్నాయట. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోడలు స్మిత రాకేష్‌ ఆ ఆహ్వాన పత్రిక వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. అది చూస్తే- ప్రేమజంట రాధికా మర్చంట్, అనంత్‌ అంబానీల వివాహం ‘న భూతో న భవిష్యతి’ అన్నరీతిలో జరిపించనున్నారని తెలుస్తోంది. ఎందుకంటే చిన్నపాటి బీరువాని తలపిస్తూ ఎరుపు రంగు బాక్సులా ఉన్న ఆ పెళ్లి పత్రికను తెరవగానే లోపల పూ లతలతో డిజైన్‌ చేసిన మినియేచర్‌ వెండి ఆలయం ఉంది.

దానికి ముందువైపు గంటలు, అందమైన మోటిఫ్‌లను అందంగా అలంకరించారు. ఆలయం లోపల నలువైపులా బంగారంతో చేసిన దేవతామూర్తుల విగ్రహాలను ఉంచారు. ఆ బాక్సును తెరిస్తే విష్ణు సహస్రనామాలు వినిపించే ఏర్పాటునీ చేశారు. ఇక, అందులోని పెళ్లి పత్రికను ఓ అందమైన వెండి పుస్తకంలా తీర్చిదిద్దారు. ఈ పేజీల్లో వివాహ ముహూర్తం, కుటుంబ సమేతంగా హాజరై దీవెనలు అందించాలన్న అక్షర మాలికను సైతం పూ లతలు, దేవతామూర్తుల డిజైన్ల మధ్య అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ఆహ్వాన పత్రికకు పక్కగా వెండీ బంగారంతో చేసిన దేవతామూర్తుల విగ్రహాలను ఉంచిన చిన్నసైజు వెండిపెట్టె, పట్టు శాలువా, స్వీట్లు... వంటివన్నీ ఉంచారు. వీటన్నింటితోపాటు అనంత్, రాధికల పేర్లలోని మొదటి అక్షరాలతో ‘ఏఆర్‌’ అని ఎంబ్రాయిడరీ చేసిన వస్త్రాన్నీ జత చేశారు. ఎంతో సృజనాత్మకంగా డిజైన్‌ చేసిన ఈ ఖరీదైన వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ కాబోయే వధూవరులు మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్