ఇండక్షన్ స్టౌ.. వాడేటప్పుడు!

ఇండక్షన్ స్టౌ.. మామూలు స్టౌతో పోలిస్తే దీని వాడకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఒక్కోసారి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముంటుంది. ఈ క్రమంలో ఇండక్షన్ స్టౌ ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఓసారి చూద్దాం..

Published : 22 Jun 2024 21:17 IST

ఇండక్షన్ స్టౌ.. మామూలు స్టౌతో పోలిస్తే దీని వాడకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఒక్కోసారి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముంటుంది. ఈ క్రమంలో ఇండక్షన్ స్టౌ ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఓసారి చూద్దాం..

⚛ ఇండక్షన్ స్టౌ వాడుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు దానికి సరిపోయే పాత్రలనే ఎంచుకోవాలి.

⚛ కొందరు ఇండక్షన్ స్టౌని సైతం గ్యాస్ స్టౌ పక్కనే పెడుతుంటారు. దీనివల్ల సాధారణ సమయాల్లో ఎలాంటి నష్టం కలగదు. కానీ ఎప్పుడైనా పొరపాటున గ్యాస్ లీకైతే మాత్రం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌పై వేర్వేరు చోట్ల అమర్చుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

⚛ ఇండక్షన్ స్టౌని రేడియోలు, టీవీలు, కంప్యూటర్లకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే అయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల అవి పాడైపోయే అవకాశాలున్నాయి.

⚛ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్‌టెన్షన్ ప్లగ్ బాక్సులకు ఇండక్షన్ స్టౌ ప్లగ్‌ని అనుసంధానించకూడదు.

⚛ ఇండక్షన్‌ స్టౌను శుభ్రం చేసే క్రమంలో నీటిని ఉపయోగించకుండా మెత్తని వస్త్రంతో మాత్రమే తుడవాలి.

⚛ ఇండక్షన్ స్టౌకి ఉన్న రంధ్రాల్లో దుమ్ము, ధూళి చేరకుండా చూసుకోవాలి.

⚛ స్టౌకి ఏమైనా పగుళ్లు వచ్చినట్లనిపిస్తే దానిని ఉపయోగించకూడదు.

⚛ అలాగే స్టౌ దగ్గర్లో ఎలాంటి లోహ సామగ్రిని ఉంచకూడదు.

⚛ ఇండక్షన్ స్టౌ విద్యుత్‌తో పని చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు దీనిని చెక్క టేబుల్ పై పెట్టడం మంచిది. అంతేకాకుండా సెరామిక్ టైల్స్, సిమెంట్ ఫ్లోర్ పైన కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ స్టౌ మెటల్ టేబుల్ పైన మాత్రం పెట్టకూడదు. దీనివల్ల షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్