ఎలా వాడాలో తెలుసా!

అందంగా కనిపించాలనే తాపత్రయంతో ఖరీదు లెక్క చేయకుండా చాలా ఉత్పత్తులే కొంటుంటాం. కానీ, వాటిని ఎప్పటివరకూ, ఎలా వాడాలి అనే విషయాలు తెలుసుకోకపోతే  చిక్కులు తప్పకపోవచ్చు.

Published : 01 Jul 2024 04:10 IST

అందంగా కనిపించాలనే తాపత్రయంతో ఖరీదు లెక్క చేయకుండా చాలా ఉత్పత్తులే కొంటుంటాం. కానీ, వాటిని ఎప్పటివరకూ, ఎలా వాడాలి అనే విషయాలు తెలుసుకోకపోతే  చిక్కులు తప్పకపోవచ్చు. అందుకోసమే మీకీ సూచనలు...

మేకప్‌ ఉత్పత్తులు ఏవైనా చర్మం, కళ్లు, పెదాలు వంటి సున్నిత భాగాలపై రాస్తాం కాబట్టి తప్పనిసరిగా నాణ్యమైన రకాల్ని ఎంచుకోవాలి. కొనే ముందే ఆయా ఉత్పత్తుల గడువు తేదీలను మార్కర్‌తో సీసాలపై రాసుకోవాలి.

ఫౌండేషన్‌: సాధారణంగా దీన్ని ఆరు నెలల నుంచి ఏడాది వరకూ వాడుకోవచ్చు. అది పొడారకుండా, లోపలికి సూక్ష్మక్రిములు చేరకుండా ఉండాలంటే... చేతులతో తాకకూడదు. కావాల్సినంత ఫౌండేషన్‌ని ముంజేతిమీద వేసుకుని వాడుకోవాలి. మూత బిగుతుగా పెట్టడమూ మరచిపోవద్దు.

లిప్‌స్టిక్, లిప్‌లైనర్, గ్లాస్‌: వీటి జీవితకాలం ఏడాదే. ఇవి పొడారినట్లు కనిపిస్తుంటే పాడవుతున్నాయని గుర్తించాలి.  ఫ్రిజ్‌లో ఉంచి వాడుకుంటే త్వరగా ఆరిపోవు.

ఐబ్రో పెన్సిల్, కాటుక: కళ్ల  అందాన్ని రెట్టింపు చేసే వీటిని సంవత్సరం వరకూ వాడుకోవచ్చు. పెన్సిళ్లను ఎప్పటికప్పుడు చెక్కుతాం గనుక వాటితో ఏ సమస్యా ఉండదు. కాటుకను పెట్టేటప్పుడు తప్పనిసరిగా చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. మూతలు ఊడిపోకుండా చూసుకోవాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

మస్కారా: మూడు నెలలకే దీని జీవితకాలం ముగుస్తుంది. దీన్ని ఇతరులతో పంచుకోవడం మానేయాలి. మూడు నెలలు కాగానే మస్కారా ఇంకా ఉన్నా... కొత్తది కొనుక్కోవడం వల్ల కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తపడొచ్చు.

గోళ్లరంగు: దీన్ని ఏడాది నుంచి రెండేళ్ల వరకూ వాడుకోవచ్చు. పెచ్చులుగా ఊడుతున్నా, తరచూ గడ్డకడుతున్నా... వాడకపోవడమే మేలు. దీన్ని కూడా ఫ్రిజ్‌లో ఉంచితే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్