టీ తాగుతున్నా... బరువు పెరుగుతానా?

నా వయసు ముప్ఫైఐదు. నేనో ఉద్యోగినిని.. ఉదయం పూట ఇంటి పనుల హడావుడిలో టిఫిన్‌ తినడానికి కుదరదు. దీంతో టీ తాగి ఆఫీసుకి వెళ్లిపోతుంటా. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ తీసుకుంటా.

Updated : 04 Jul 2024 14:24 IST

నా వయసు ముప్ఫైఐదు. నేనో ఉద్యోగినిని.. ఉదయం పూట ఇంటి పనుల హడావుడిలో టిఫిన్‌ తినడానికి కుదరదు. దీంతో టీ తాగి ఆఫీసుకి వెళ్లిపోతుంటా. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ తీసుకుంటా. ఇలా చేయడం వల్ల రోజంతా అలసట ఉంటుందనీ, అధికబరువు పెరుగుతామనీ అంటున్నారు. నా ఎత్తు 5.2, బరువు 75 కిలోలు. ఇందుకే నేను సన్నబడటం లేదా చెప్పగలరు?
శర్వాణి, హైదరాబాద్‌

జ. సాధారణంగా అల్పాహారం, లంచ్, డిన్నర్‌...అంటూ రోజూ తీసుకునే ఆహారాన్ని మూడు భోజనాలుగా చెబుతాం కదా! ఆయా వేళల్లో ఏయే పదార్థాలు తింటున్నారు. వాటి నుంచి మీకు కెలొరీలు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు, పీచు... వంటి పోషకాలు ఎంత మోతాదులో అందుతున్నాయి అన్నదీ ముఖ్యమే. ఎందుకంటే ఇవన్నీ సమపాళ్లలో శరీరానికి అందితేనే ఒక పూట తినడం మానేసినా ఆరోగ్యంగా ఉండగలరు. అయితే, బరువు తగ్గాలనుకున్నప్పుడు - శరీరానికి సరిపడా కెలొరీలు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే, వేళలు మాత్రమే బరువు తగ్గడానికీ, పెరగడానికీ కారణం కాదు.

మీ విషయానికి వస్తే మీరు తీసుకునే ఆహార విధానాలకు తగ్గట్లు మీ శరీరం అలవాటు పడిపోయింది. సాధారణంగా ప్రతి వ్యక్తికీ వారి జీవగడియారం ఆధారంగా కొందరికి ఉదయం పూట చక్కెర నిల్వలు అధికంగా ఉంటే, మరికొందరిలో సాయంత్రం పూట ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని బట్టి వారి భోజనవేళలు మార్చుకోవచ్చు. అయితే, మీరు ఒక పూట అల్పాహారమో, భోజనమో మానేసినా అందాల్సిన ప్రొటీన్, కెలొరీలు, ఖనిజాలు, పీచు, విటమిన్లు...అన్నీ అందుతున్నాయో లేదో చూసుకోండి. అలానే, కెలొరీల మోతాదు తగ్గించి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. ఇవన్నీ  మీపై ప్రతికూల ప్రభావం చూపించకుండా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్