- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
సమస్యలు లేకున్నా చిరాకు పడుతోంది
మా అమ్మాయికి 27ఏళ్లు. గత కొద్ది రోజుల నుంచీ చిరాకుగా ఉంటోంది. తనకు మంచి స్నేహితులున్నారు. ఉద్యోగంలోనూ స్థిరపడింది. కుటుంబ సమస్యలూ ఏమీ లేవు.
మా అమ్మాయికి 27ఏళ్లు. గత కొద్ది రోజుల నుంచీ చిరాకుగా ఉంటోంది. తనకు మంచి స్నేహితులున్నారు. ఉద్యోగంలోనూ స్థిరపడింది. కుటుంబ సమస్యలూ ఏమీ లేవు. కానీ, ఎందుకో ఈ మధ్య మాతో తక్కువగా మాట్లాడుతోంది. ప్రేమ సమస్యలేమైనా ఉన్నాయా అని అడిగా. అలాంటివి ఏవీ లేవంటోంది. ఎన్ని రకాలుగా ఆలోచించినా కారణాలు తెలియట్లేదు. తను డిప్రెషన్లో ఉందనిపిస్తోంది. నేనేం చేయాలి.
ఓ సోదరి
ఈ వయసులో అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ల జీవితంలో రకరకాల మానసిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఉద్యోగం సాధించడం, అది వచ్చాక స్నేహితులతో ఆదాయాన్ని పోల్చుకోవడం వంటివి చేస్తుంటారు. లేదా రిలేషన్షిప్ సమస్యలూ ఉండి ఉండొచ్చు. ఇలాంటివి వాళ్లను నేరుగా అడిగితే చెప్పరు. మరింత అవమానంగా భావిస్తారు. కొందరికి పెళ్లి విషయంలోనూ భయాందోళనలు ఉంటాయి. ఇదే కాకుండా... వీళ్ల వ్యక్తిత్వం కూడా ఒక్కోసారి ఈ ప్రవర్తనకు కారణమవ్వొచ్చు. అందరిలోనూ కలిసిపోలేక, నచ్చినట్లు ఉండలేక కూడా ఇబ్బందులు పడుతుంటారు. సమాజాన్ని ఎదుర్కోవాలంటే భయ పడుతుంటారు. ఏదేమైనా మీ అమ్మాయి ఇదివరకటిలా ఉండకపోవడం, మాట్లాడకపోవడం వంటివాటిని గమనిస్తే... ఆమె మానసికస్థితి సరిగా లేదనిపిస్తోంది. డిప్రెషన్లో ఉందనిపిస్తోంది. కాబట్టి, ముందు మీ అమ్మాయిని సైకియాట్రిస్టు దగ్గరికి తీసుకెళ్లండి. వాళ్లు తనని పరీక్షించి, మానసిక స్థితి ఎలా ఉందో చూస్తారు. ఆమె ఆలోచనలేంటో, సమస్యలు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకుంటారు. ఈ ప్రవర్తనకు కారణమేంటో కనుక్కుని, అవసరమైతే కౌన్సెలింగ్‌కు పంపిస్తారు. మెల్లగా తన ప్రవర్తన మారే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- మెడ పైన ముడతలు.. తగ్గాలంటే..!
- గాజుల రాజసం!
- ఎలా వాడాలో తెలుసా!
- చర్మం పొడిబారిందా..?
- ప్యాంట్నీ పట్టించుకోండి!
ఆరోగ్యమస్తు
- ఈ కాలంలో వచ్చే వ్యాధులను ఎదుర్కోవాలంటే..!
- సప్లిమెంట్లకు దూరంగా...
- తరచుగా అబార్షన్.. ఎందుకిలా?
- ప్రొటీన్‌కి పచ్చి బఠాణీ
- సువాసనల రోజ్మేరీ!
అనుబంధం
- Adoption: పిల్లల్ని దత్తత తీసుకున్నారా?
- ఇబ్బందే... అయినా సమాధానం చెప్పాలి
- బాధ్యత తెలుసుకుని నడిస్తేనే...
- మా మధ్య ప్రేమ లేదు.. కలిసుండాలా? విడిపోవాలా?
- కొట్టడమే మార్గమా?
యూత్ కార్నర్
- Self-confidence: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?
- పారిస్ ఒలింపిక్స్‌ను క్లిక్‌మనిపించాలని..!
- పనికిరాని వాటితో... ఫోర్బ్స్‌లోకి
- ‘లాభాల పుట్ట’ గొడుగులు
- అందుకే అబ్బాయిలా మారి...!
'స్వీట్' హోం
- వీటి కోసం.. యాపిల్ సైడర్ వెనిగర్..!
- సమస్యలు లేకున్నా చిరాకు పడుతోంది
- బండ రాళ్లు కావివి..!
- అలంకరణలోనే అవసరమైనవన్నీ..!
- వెండి ఆభరణాలు భద్రంగా ఉండాలంటే..!
వర్క్ & లైఫ్
- ఇద్దరు పిల్లలున్నారు... పెళ్లికాలేదట!
- Alia Bhatt: నా బిడ్డ కోసం రోజూ ఇలా చేస్తున్నా.. మరి మీరు?!
- ఉద్యోగమే జీవితమైపోయింది.. తోలుబొమ్మలా అలసిపోతున్నా!
- గృహిణిగా ఉండమంటే.. భర్త కంపెనీలో వాటా అడిగింది!
- Renu Desai: మీకు కుటుంబాల్లేవా? ఇకనైనా వీటిని ఆపండి!