బామ్మ డ్యాన్స్‌ వైరల్‌..!

అదొక వృద్ధాశ్రమం. నా అనేవాళ్ల పలకరింపు లేక నిరాశానిస్పృహలతో ఉన్న అక్కడి వారందరిలో తన డ్యాన్స్‌తో ఉత్సాహాన్ని నింపింది 95 ఏళ్ల ఓ బామ్మ. స్తబ్దత నిండిన ఆ వాతావరణాన్నంతా సంతోషంతో నింపింది. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తే... లక్షల మంది వీక్షించడమే కాదు, అభినందనలనూ తెలియజేస్తున్నారు.

Published : 29 Jun 2024 02:16 IST

అదొక వృద్ధాశ్రమం. నా అనేవాళ్ల పలకరింపు లేక నిరాశానిస్పృహలతో ఉన్న అక్కడి వారందరిలో తన డ్యాన్స్‌తో ఉత్సాహాన్ని నింపింది 95 ఏళ్ల ఓ బామ్మ. స్తబ్దత నిండిన ఆ వాతావరణాన్నంతా సంతోషంతో నింపింది. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తే... లక్షల మంది వీక్షించడమే కాదు, అభినందనలనూ తెలియజేస్తున్నారు.

సామర్థ్యం, నైపుణ్యాలకు వయసుతో పనిలేదని నిరూపించింది తమిళనాడుకు చెందిన 95 ఏళ్ల బామ్మ. వృద్ధుల ఆశ్రమంలో ఉంటున్న ఈమె కళాక్షేత్ర ఫౌండేషన్‌ పూర్వవిద్యార్థిని అట. 1940లలో నృత్యకళాకారిణిగా ‘చంద్రలేఖ’ వంటి పలు తమిళ చలనచిత్రాల్లో బ్యాగ్రౌండ్‌ ఆర్టిస్టుగానూ పనిచేసిన అనుభవం ఈమెకు ఉందట. వృద్ధాశ్రమంలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ‘ఓ రసిక సీమానే’ అనే తమిళ పాటకు డ్యాన్స్‌ చేసి శాస్త్రీయ నృత్య కళాకారిణిగా అందరినీ మెప్పించిందీమె. ఈ బామ్మ చేసిన డ్యాన్స్‌కు ఆశ్రమంలో ఉన్న వృద్ధులంతా తమ గత జ్ఞాపకాల్లోకి జారిపోయారట. ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో మూడు రోజుల్లోనే ఈ వీడియోను పదమూడున్నర లక్షలమందికిపైగా వీక్షించి తమ అభినందనలు పంపుతున్నారు. మరికొందరైతే ఆమె చేసిన ప్రతి భంగిమలోనూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అన్న కామెంట్లూ పెడుతున్నారు. ఏది ఏమైనా ఇంత లేటు వయసులోనూ ఈ బామ్మ తన అద్భుతమైన నృత్యంతో అందరినీ అలరించడం ప్రశంసనీయం కదూ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్