క్వీన్‌... ఇంగ్లిష్‌ ఛానెల్‌ ఈదేశారు!

తెలంగాణకు చెందిన స్విమ్మర్‌ డాక్టర్‌ క్వీన్‌ విక్టోరియా గంధం ఇంగ్లిష్‌ ఛానెల్‌ను ఈదారు. ఇంగ్లండ్‌ నుంచి ఫ్రాన్స్‌ వరకూ రిలే స్విమ్‌ చేశారీమె. దాంతో ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించారు 43ఏళ్ల క్వీన్‌. 12నుంచి 14డిగ్రీల ఉష్ణోగ్రతల్లో 71కిలోమీటర్లు ఈదారీమె.

Published : 28 Jun 2024 02:52 IST

తెలంగాణకు చెందిన స్విమ్మర్‌ డాక్టర్‌ క్వీన్‌ విక్టోరియా గంధం ఇంగ్లిష్‌ ఛానెల్‌ను ఈదారు. ఇంగ్లండ్‌ నుంచి ఫ్రాన్స్‌ వరకూ రిలే స్విమ్‌ చేశారీమె. దాంతో ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించారు 43ఏళ్ల క్వీన్‌. 12నుంచి 14డిగ్రీల ఉష్ణోగ్రతల్లో 71కిలోమీటర్లు ఈదారీమె. మొత్తం 8మంది బృంద సభ్యులు... 60గంటల 54నిమిషాలు ఈదారు. గృహిణిగా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పోలీస్‌ అకాడమీలో కోచ్‌గా అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారీమె. హైదరాబాద్‌ నివాసి అయిన క్వీన్‌ తన ఇద్దరు పిల్లలనూ రోజూ స్విమ్మింగ్‌ తరగతులకు తీసుకెళ్లేవారట.

అలా ఆమెకూ ఈతపై ఆసక్తి పెరిగింది. పిల్లలూ ప్రోత్సహించడంతో 38ఏళ్ల వయసులో ఈత నేర్చుకుని, అనేక పోటీల్లోనూ పాల్గొంటున్నారు. ‘ఓవైపు ఎగిసిపడే అలలు... మరోవైపు గడ్డకట్టే చలి... భయం, అలసటలతో వణికిపోయాను. వాటిని తట్టుకుని ఫ్రీస్టైల్‌ స్విమ్‌కు రావడానికి నాకు రెండు మూడు నిమిషాలు పట్టింది. సముద్రంలోని జెల్లీ ఫిష్‌ నన్ను ముద్దాడుతుంటే కొత్త శక్తి వచ్చింది’ అంటూ తన అనుభవాలు పంచుకున్నారు క్వీన్‌. గతంలో టర్కీ మాస్టర్స్‌ ఇంటర్నేషనల్‌ మీట్‌ 2019, సెర్బియా వాటర్‌ ఫిన్‌స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 2023... వంటి పోటీల్లోనూ పాల్గొన్నారు. నేర్చుకోవాలనే తపన ఉండాలే కానీ, అందుకు వయసు అడ్డుకాదని నిరూపిస్తున్నారు క్వీన్‌.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్