చదువా... పిల్లలా?

డిగ్రీ పూర్తయ్యింది. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. ఇటీవలే ప్రమోషన్‌ కూడా వచ్చింది. ఎనిమిది నెలల క్రితమే పెళ్లయ్యింది. అయితే ఎంబీఏ చేయాలనేది నా కోరిక. ఓవైపు పిల్లలనూ ప్లాన్‌ చేసుకోవాలి అనుకుంటున్నాం. నా కెరియర్‌ ప్రణాళిక ఎలా చేసుకోవాలి? 

Updated : 26 Jun 2024 12:26 IST

డిగ్రీ పూర్తయ్యింది. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నా. ఇటీవలే ప్రమోషన్‌ కూడా వచ్చింది. ఎనిమిది నెలల క్రితమే పెళ్లయ్యింది. అయితే ఎంబీఏ చేయాలనేది నా కోరిక. ఓవైపు పిల్లలనూ ప్లాన్‌ చేసుకోవాలి అనుకుంటున్నాం. నా కెరియర్‌ ప్రణాళిక ఎలా చేసుకోవాలి? 

- ఓ సోదరి

కెరియర్‌ ప్రారంభంలో చాలామంది అమ్మాయిలకు వచ్చే సందేహమే ఇది. కెరియర్‌ ప్రణాళిక విషయంలో మగవారితో పోలిస్తే ఆడవాళ్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇల్లూ, పిల్లలూ, ఇంట్లోని పెద్దవాళ్ల సంరక్షణ... శతాబ్దాలుగా ఈ బాధ్యత ఆడవాళ్లపైనే ఉంటూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మగవాళ్లూ ఈ బాధ్యతలని పంచుకుంటున్నా... అది సమానంగా ఉండట్లేదు. మన జీవితంలో చదువూ, పెళ్లీ, పిల్లలూ... వీటన్నింటికీ ఒక్కోదానికి ఒక్కో దశ ఉంటుంది. సాధారణంగా ముప్పై ఏళ్లు దాటాక అమ్మాయిల్లో పీసీఓడీ, థైరాయిడ్‌ లాంటివి తలెత్తి గర్భధారణలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, పైచదువులు చదువుకోవాలంటే భవిష్యత్తులోనూ అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వయసుకు తగినట్లు పిల్లల్ని ప్లాన్‌ చేసుకుంటే మంచిది. ఇప్పటికే మీరు ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి, ఒకవేళ మీరు పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంటే వాళ్లను చూసుకోవడానికి పెద్దవాళ్లు ఎవరైనా ఉంటే మంచిది. అప్పుడు కెరియర్‌ కూడా సాఫీగా సాగుతుంది. అలా కాకుండా మల్టీటాస్కింగ్‌ చేయాలనుకుంటే మాత్రం మీ మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోండి.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్