నేత్రా వెనక మన స్నిగ్ధ!

సౌరభ్‌ నేత్రావల్కర్‌... తాజా టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను అనుసరిస్తున్న ఎవరికైనా ఈ పేరు సుపరిచితమే! పేరుకి అమెరికా జట్టు తరఫున ఆడుతున్నా... ఇతనిది ముంబయి. గతంలో భారత్‌ తరఫునా ఆడాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడ టెకీగా స్థిరపడ్డాడు.

Published : 18 Jun 2024 14:06 IST

ట్రెండింగ్‌

సౌరభ్‌ నేత్రావల్కర్‌... తాజా టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను అనుసరిస్తున్న ఎవరికైనా ఈ పేరు సుపరిచితమే! పేరుకి అమెరికా జట్టు తరఫున ఆడుతున్నా... ఇతనిది ముంబయి. గతంలో భారత్‌ తరఫునా ఆడాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, అక్కడ టెకీగా స్థిరపడ్డాడు. తాజాగా అమెరికా జట్టులో స్థానం సంపాదించాడు. టీ20 పోరులో పాకిస్థాన్‌పై తమ జట్టు గెలవడంలో ప్రధాన పాత్ర నేత్రాదే. భారత్‌పై యూఎస్‌ జట్టు ఓడినా ఇక్కడ తన ఆటతో అభిమానుల మనసు కొల్లగొట్టాడు. అందుకే ఈ క్రీడాకారుడి గురించి తెలుసుకోవడానికి అందరూ గూగుల్‌లో తెగవెదికేస్తున్నారు. అప్పుడే నేత్రా వెనక పవర్‌ఫుల్‌ భాగస్వామి ఉందని అర్థమైంది. ఆమె పేరు దేవి స్నిగ్ధ ముప్పాల. మన తెలుగు మూలాలున్న అమ్మాయే. బెంగళూరులో కంప్యూటర్‌సైన్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ఈమె మాస్టర్స్‌ కోసం అమెరికా వెళ్లింది. అక్కడ కార్నెల్‌ యూనివర్సిటీలో పీజీ పూర్తిచేసి, నేత్రాతోపాటు ‘ఒరాకిల్‌’లో ప్రిన్సిపల్‌ అప్లికేషన్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. అన్నట్టూ తను కథక్‌ డ్యాన్సర్‌ కూడా. అమెరికా అంతటా ప్రదర్శనలివ్వడమే కాదు... డ్యాన్స్‌నే వ్యాపార మార్గంగానూ మలుచుకుంది. ఫిట్‌నెస్‌కి బాలీవుడ్‌ పాటలను జోడిస్తూ ‘బాలీఎక్స్‌ డ్యాన్స్‌ ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌’ని రూపొందించింది. దీనికి అక్కడ ఆదరణ ఎక్కువే. యూఎస్‌ ‘షార్క్‌ ట్యాంక్‌’ ప్రోగ్రామ్‌లోనూ స్నిగ్ధ ప్రయాణం టెలికాస్ట్‌ అయ్యింది.

నేత్రావల్కర్, స్నిగ్ధలు 2020లో పెళ్లితో ఒక్కటయ్యారు. వివాహ సమయంలో ఇరువురి సంప్రదాయాలకూ చోటిచ్చారు. ఇద్దరూ తమతమ కెరియర్లతో ఎంత బిజీగా ఉన్నా... అవసరమైనప్పుడు ఒకరికొకరు అండగా నిలుస్తారు. నేత్రా ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతున్నా ఉత్సాహపరచడానికి స్నిగ్ధ స్టేడియానికి వచ్చేస్తుంది. తన కార్యక్రమాలకు నేత్రా సహకారం తప్పనిసరి. ఓవైపు కెరియర్‌లో ఉత్సాహంగా సాగిపోతూ... పేషన్‌కీ విలువివ్వడం, ఒకరికొకరు తోడు నిలవడం చూసి నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. అంతేకాదు, ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’, ‘పవర్‌ఫుల్‌ కపుల్‌’ అన్న కితాబులూ ఇస్తున్నారు. నిజంగానే ముచ్చటైన జోడీ కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్