ఈ స్టీలు గ్లాసుని మడతపెట్టొచ్చు...

కిచెన్‌లో వాడుకునే వస్తువులు అవసరాన్ని తీర్చడంతోపాటు సౌకర్యంగానూ ఉంటే బాగుంటుంది కదా! అలాంటి వాటిలో కొన్ని ఇవి...

Updated : 03 Jul 2024 01:51 IST

కిచెన్‌లో వాడుకునే వస్తువులు అవసరాన్ని తీర్చడంతోపాటు సౌకర్యంగానూ ఉంటే బాగుంటుంది కదా! అలాంటి వాటిలో కొన్ని ఇవి...


కోరుకున్న సైజులో..

సాధారణంగా మనం టీ, మంచినీళ్లు, పాలు, జ్యూస్‌... వంటివి తాగడానికి ఒక్కోదానికి ఒక్కో గ్లాసు ఉపయోగిస్తాం కదా! అలాకాకుండా ఒకటే గ్లాసు మనకు కావాల్సిన పరిమాణంలోకి మార్చుకోగలిగితే ఎంత బాగుంటుందో కదా! తయారీదారులు కూడా దీన్ని గమనించారేమో ఫోల్డబుల్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కప్‌ను తయారుచేశారు. సైజ్‌ అడ్జస్ట్‌ చేసుకునే విధంగా కొలాప్సబుల్‌ డిజైన్‌ చేశారు. మూడు గ్లాసులు వాడే చోట ఒక్కదాన్నే వాడొచ్చన్నమాట. అంతేకాదు, అవసరమైనప్పుడు దీన్ని మడిచేసి, ప్రయాణాలూ, క్యాంపింగ్, అవుట్‌డోర్‌ యాక్టివిటీస్‌... లాంటి వాటికి సులభంగా తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా ప్లాస్టిక్‌ గ్లాసులు వాడాల్సిన అవసరం లేకుండా ఎంచక్కా స్టీల్‌ గ్లాస్‌నే వాడొచ్చు. ఏమంటారు?


ప్లేటు పడేసుకోరిక...

చిన్న పిల్లలకు వాళ్లంతట వాళ్లు తినడం అలవాటు కావాలని ప్లేటులో ఆహారం పెట్టిస్తాం. కానీ వాళ్లేమో చాలాసార్లు కింద పడేసుకుంటుంటారు. అలాకాకుండా ఈ మ్యాజిక్‌ బౌల్‌ తీసుకురండి. ఇది 360 డిగ్రీల కోణాల్లో తిరుగుతుంది. ప్లేటుని పైకి, కిందకీ, పక్కకు, ఎటు తిప్పినా కూడా ఆహారం పడిపోతుందన్న భయం ఉండదు. 


మూలల్లోనూ శుభ్రపరచొచ్చు...

వంటగదిలోని సింక్‌లోని జల్లెడలోనూ, ట్యాప్‌ వెనక భాగంలోనూ, కౌంటర్‌టాప్‌ అంచుల్లోనూ జిడ్డు, మట్టి అంత ఈజీగా వదలదు. అలాంటప్పుడు ఈ గ్యాప్‌ క్లీనింగ్‌ బ్రష్‌ బాగా ఉపయోగపడుతుంది. ఫ్లాట్‌ బ్రష్‌ అవడం వల్ల ఇటువంటి చోట్ల శుభ్రపరచుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. పీఈటీ బ్రసెల్స్‌తో మురికీ తొందరగా పోతుంది. అంతేకాదు, దీన్ని అవెన్, స్లైడింగ్‌ డోర్‌ రైల్స్, బాత్‌రూమ్‌... వంటివి శుభ్రం చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్