సమస్యలు లేకున్నా చిరాకు పడుతోంది

మా అమ్మాయికి 27ఏళ్లు. గత కొద్ది రోజుల నుంచీ చిరాకుగా ఉంటోంది. తనకు మంచి స్నేహితులున్నారు. ఉద్యోగంలోనూ స్థిరపడింది. కుటుంబ సమస్యలూ ఏమీ లేవు.

Updated : 01 Jul 2024 13:12 IST

మా అమ్మాయికి 27ఏళ్లు. గత కొద్ది రోజుల నుంచీ చిరాకుగా ఉంటోంది. తనకు మంచి స్నేహితులున్నారు. ఉద్యోగంలోనూ స్థిరపడింది. కుటుంబ సమస్యలూ ఏమీ లేవు. కానీ, ఎందుకో ఈ మధ్య మాతో తక్కువగా మాట్లాడుతోంది. ప్రేమ సమస్యలేమైనా ఉన్నాయా అని అడిగా. అలాంటివి ఏవీ లేవంటోంది. ఎన్ని రకాలుగా ఆలోచించినా కారణాలు తెలియట్లేదు. తను డిప్రెషన్‌లో ఉందనిపిస్తోంది. నేనేం చేయాలి.

ఓ సోదరి

ఈ వయసులో అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ల జీవితంలో రకరకాల మానసిక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఉద్యోగం సాధించడం, అది వచ్చాక స్నేహితులతో ఆదాయాన్ని పోల్చుకోవడం వంటివి చేస్తుంటారు. లేదా రిలేషన్‌షిప్‌ సమస్యలూ ఉండి ఉండొచ్చు. ఇలాంటివి వాళ్లను నేరుగా అడిగితే చెప్పరు. మరింత అవమానంగా భావిస్తారు. కొందరికి పెళ్లి విషయంలోనూ భయాందోళనలు ఉంటాయి. ఇదే కాకుండా... వీళ్ల వ్యక్తిత్వం కూడా ఒక్కోసారి ఈ ప్రవర్తనకు కారణమవ్వొచ్చు. అందరిలోనూ కలిసిపోలేక, నచ్చినట్లు ఉండలేక కూడా ఇబ్బందులు పడుతుంటారు. సమాజాన్ని ఎదుర్కోవాలంటే భయ పడుతుంటారు. ఏదేమైనా మీ అమ్మాయి ఇదివరకటిలా ఉండకపోవడం, మాట్లాడకపోవడం వంటివాటిని గమనిస్తే... ఆమె మానసికస్థితి సరిగా లేదనిపిస్తోంది. డిప్రెషన్‌లో ఉందనిపిస్తోంది. కాబట్టి, ముందు మీ అమ్మాయిని సైకియాట్రిస్టు దగ్గరికి తీసుకెళ్లండి. వాళ్లు తనని పరీక్షించి, మానసిక స్థితి ఎలా ఉందో చూస్తారు. ఆమె ఆలోచనలేంటో, సమస్యలు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకుంటారు. ఈ ప్రవర్తనకు కారణమేంటో కనుక్కుని, అవసరమైతే కౌన్సెలింగ్‌కు పంపిస్తారు. మెల్లగా తన ప్రవర్తన మారే అవకాశం ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్